తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా.. బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ప్రతిపక్షాలుగా ఉన్న భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలు బతుకమ్మ పండగ తీరుపై విమర్శలు చేస్తున్నాయి. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. అందులోనూ బతుకమ్మ పండగలో కవిత పాత్రపై వారు ప్రత్యేకంగా విమర్శలు చేస్తున్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను ఉత్సవంలా నిర్వహించడం ఏమిటి? అంటి అని ప్రశ్నిస్తున్నాడు భారతీయ జనతా పార్టీ నేత నాగం జనార్ధన్ రెడ్డి. మరి తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మకు చాలా రోజుల కిందట నుంచి ఏర్పాట్లు చేస్తోంది. అప్పుడంతా ఏమీ మాట్లాడని ఈ బీజేపీ నేత ఇప్పుడు మాత్రం విమర్శలు చేస్తున్నాడు. మరోవైపు తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ కవితను లక్ష్యంగా చేసుకొంది. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండను కవితమ్మ అనే పేరు మీద నిర్వహిస్తోందేమో.. ఇది కేసీఆర్ కుటుంబం వ్యవహారం మారిందేమో.. అనే సందేహాలు వ్యక్తం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. కేసీఆర్ తన కూతురికి బతుకమ్మ పండగ సందర్భంగా పది కోట్ల రూపాయలను ఆడపడుచు ఖర్చు కింద ఇచ్చాడేమో అంటూ తెలంగాణ టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. బతుకమ్మ పండగ సందర్భంగా అంతటా కవితే కనిపిస్తోందనేది తెలుగుదేశం వాళ్ల బాధ. ఈ విధంగా బతుకమ్మ పండగ గురించి కేసీఆర్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. తమ నిరసనను తెలుపుతున్నాయి. అయితే బతుకమ్మ నిర్వహణ గురించి ఇలాంటి విమర్శలు వస్తాయని బహుశా తెలంగాణ ప్రభుత్వం ఊహించి ఉండదు. సంస్కృతి సంప్రదాయల పరిరక్షణ అంటూ నిర్వహిస్తున్నందున ప్రశంసలు వస్తాయని అనుకొన్నారు. అయితే ప్రతిపక్షాలు సహజంగానే విమర్శలకు దిగాయి. మరి వారికి కేసీఆర్ ఏమని సమాధానం చెబుతారో!

మరింత సమాచారం తెలుసుకోండి: