భారతీయ జనతా పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు కిషన్ రెడ్డి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల గోదాలోకి దిగనున్నారట. అక్కడ పార్టీ తరపున ప్రచారం చేయడానికి ఆయన వెళుతున్నారట. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. నామినేషన్ల గడువు ముగిసిన నేపథ్యంలో కిషన్ రెడ్డి ప్రచారానికి రెడీ అయినట్టుగా ప్రకటన చేశాడు. తెలంగాణకు పక్క రాష్ట్ర మే కాబట్టి తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలు ఈ బాధ్యతలు స్వీకరించినట్టుగా ఉన్నారు. అక్కడ పార్టీని గెలిపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ప్రకటించారు. సాధారణంగా అన్ని పార్టీల నేతలూ ఇలాంటి బాధ్యతనూ తీసుకొంటారు. ఆ మధ్య చిరంజీవి కూడా వెళ్లి తమిళనాడు, కర్ణాటకల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే ప్రయత్నం చేశాడు. ప్రచారం చేసి వచ్చాడు. ఆ బాటలోనే కిషన్ రెడ్డి మహారాష్ట్రలో భారతీయజనతాపార్టీ తరపున ప్రచారానికి వెళుతున్నాడనిచెప్పవచ్చు. మరి ఈ తెలుగునేత వెళ్లి అక్కడ ఏ మేరకు ఓట్లు వేయిస్తాడనేది ఆసక్తికరంగా మారిందిప్పుడు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి కొన్ని వరాలు కూడా ఇస్తున్నాడు. ఒకవేళ మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వస్తే.. అక్కడి తెలుగువారి మేలు కోసం కృషి చేస్తామని ఈయన అంటున్నాడు. తద్వారా తెలుగువారిని ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా... అక్కడ ఓటు వేయాల్సింది తెలుగు వారు కాదు కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: