మందీమార్బలంతో కోర్టకు వెళ్లిన జయలలిత అటు నుంచి జైలుకు వెళ్లారు. అవినీతి కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో జైల్లో వెళ్లి కూర్చొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో... విమానాలు, హెలీ కాప్టర్ల ద్వార జయలలిత కోర్టుకు హాజరుకావడం... ఆహోదాను పోగొట్టుకొంటూ జైలుకు వెళ్లడం నిజంగా విశేషమేనని చెప్పాలి. ఆమె జీవితంలో అత్యంత షడన్ గావచ్చిన మార్పు అని చెప్పాలి. మరి ముఖ్యమంత్రి హోదాలో ఇలా జైలు పాలైన ఏకైక రాజకీయ నేతగా నిలిచిన జయలలిత జైల్లో ఎలా గడుపుతోంది? అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరమైన విషయమే. శనివారం రాత్రి జయలలిత నిద్రలేమితో ఇబ్బంది పడ్డారట. జైల్లో నిద్ర పట్టక రాత్రివేళ చాలా సయమం వరకూ మేల్కొనే ఉన్నారట. హంసతూలికాతల్పంపై నిద్రించే ఆమెకు జైల్లో ఎలా నిద్రపడుతుంది మరి. ఉదయాన్నే ఆమెకు జైలు అధికారులు బయట నుంచి టిఫిన్ తెచ్చిపెట్టినట్టు తెలుస్తోంది. తమిళుల ట్రేడ్ మార్కు ఇడ్లీ సాంబర్ ను తెచ్చిపెట్టారట. అనంతరం తమిళనాడు మంత్రులు, అధికార గణం జైలుకు తరలివచ్చినట్టు సమాచారం. రాజకీయ పరిణామాలు.. తదుపరి వ్యూహాల గురించి అమ్మ ఆదేశాలను వారు తీసుకొన్నట్టు సమాచారం. అలాగే ఆమె వ్యక్తిగత కార్యదర్శి, తమిళనాడు ప్రభుత్వ సలహాదారు.. మాజీ ఐఏఎస్ అధికారాని షీలా కూడా జయలలిత సమావేశం అయ్యారు. వీరు కొన్ని పత్రికలను తీసుకెళ్లి జయలలితకు అందజేశారట. నలుగు తమిళ పత్రికలు,,, రెండు ఇంగ్లిష్ దినపత్రికలు తీసుకెళ్లి వారు జయకు అందచేసినట్టు తెలుస్తోంది. మరి ఒక్కరోజులో ముఖ్యమంత్రి హోదా నుంచి జైల్లో ఖైదీ దశకు వచ్చిన జయలలితకు బెయిల్ అయినా వస్తుందో లేక.. ఇలానే ఇబ్బంది పడాల్సి ఉంటుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: