రాయలసీమకు రాజధానిగా అన్ని అర్హతలూ ఉన్నాయి... అయితే శాంతిభధ్రతలే సరిగా లేవు..అన్నట్టుగా ఆ మధ్య తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. అది కూడా రాయలసీమలో రాజధానిని ఎందుకు ఏర్పరచరు? అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ ప్రకటన చేశారు. తద్వారా రాయలసీమ హింసాత్మక చర్యలకు ఆవాసం అనే సందేశాన్ని ఇచ్చారు చంద్రబాబు నాయడు. రాయలసీమలోనే పుట్టి అక్కడ నుంచినే రాజకీయంగా ఎదిగి.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నచంద్రబాబు నాయుడు ఈ విధంగా ప్రకటన చేయడం ఒకింత విచిత్రం. రాయలసీమలో శాంతిభద్రతల గురించి ఆయన శంకించడడం నిజంగా ఆ ప్రాంతాన్ని అవమానించడమే. అయితే బాబు గారు మాత్రం తన అభిప్రాయాన్ని చాలా గట్టిగా చెప్పారు. రాయలసీమకు రాజధాని నగరాన్ని ఇముడ్చుకొనే అర్హత లేదని తేల్చేశారు. మరి ఇప్పడు అదే చంద్రబాబు నాయుడు గారు తను రాజధానిగా ముచ్చటపడ్డ నగరం విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు! విజయవాడలో చాలా ప్లాన్డ్ హత్య జరగడం.. హత్య చేసిన వారు చాలా యధేచ్చగా పారిపోవడం. బిర్యానీలు భుజించి మరీ... అక్కడ నుంచి ఎస్కేప్ కావడంతో ఆ నగరంలో శాంతిభద్రతలు ఏ మేరకు ఉన్నాయో తేటతెల్లం అయ్యాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే విజయవాడలో శాంతిభద్రతల పరిస్థితి గురించి మాట్లాడారు. అక్కడ శాంతిభద్రతలు సరిగాలేవని ఆయన గ్రహించినట్టుగా ఉన్నారు. అందుకే ఒక తీవ్రమైన హెచ్చరిక కూడా చేశారు. విజయవాడలో రౌడీ యిజాన్ని సహించమని ఆయన ప్రకటించారు. మాఫియాను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదని బాబు స్పష్టం చేశారు. మరి రాయలసీమలో శాంతిభద్రతలు సరిగా లేవు... అందుకే రాజధాని నగరం అక్కడ వద్దు అన్నారు. మరి ముఖ్యమంత్రిగారు ఎంతో ముచ్చటపడి రాజధానిగా ప్రకటించుకొన్న నగరంలో ఉన్న శాంతిభద్రతలు ఏపాటివో ఇప్పుడు అందరికీ అర్థమయ్యే ఉంటాయి!

మరింత సమాచారం తెలుసుకోండి: