తిరుమల తిరుపతి దేవస్థానం భోర్డు ఛైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తినే నియమించి ముఖ్యమంత్రి చంద్రాబాబు మాట నిలబెట్టుకుంటున్నారు. మీడియాలో వస్తున్న కధనం ప్రకారం టిడిపి కి సంబందించి చదలవాడ కృష్ణమూర్తిని చైర్మన్ గాను,సభ్యులుగా సీఎన్ రవిశంకర్, భాను ప్రకాశ్ రెడ్డి, అనంత్ (కర్ణాటక), బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ,టిడిపి సీనియర్ ఎమ్మెల్యేలు పతివాడ నారాయణ స్వామి, బండారు సత్యనారాయణమూర్తి లను నియమించవచ్చు. తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి ఛాన్స్ ఇవ్వాలని బావిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో తిరుపతి ఎమ్మెల్యే టిక్కెట్ ను వెంకట రమణకు , టిటిడి ఛైర్మన్ పదవిని చదలవాడకు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.అయితే ఎన్నికల తర్వాత వెంకట రమణ వర్గం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించింది. అయినప్పట్టికీ చదలవాడ పేరును ఖరారు చేయడం ద్వారా చంద్రబాబు మాట నిలబెట్టుకున్నట్లయింది.ఈ పదవికి రాయపాటి, జెసి దివాకరరెడ్డి వంటివారు కూడా పోటీపడ్డారు.రెండు మూడు రోజులలో ఉత్తర్వులు రావచ్చని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: