ముఖ్యమంత్రి జయలలితను దోషిగా నిర్ధారించి న బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానం ఆమె కు నాలుేగళ్లు జైలుశిక్ష విధించింది. దీంతో ఆమె తన ఎంఎల్‌ఏ పదవికి అనర్హురాలయ్యారు. ఈ కారణంగా ఆమె ముఖ్యమంత్రి పదవికి రాజీనా మా చేశారు. ఆమెతోపాటు ఆమె స్నేహితురాలు శశిళ, ఇళవరసి, సుధాకరన్‌లను కూడా కోర్టు దోషలుగా తేల్చింది. వీరందరికి కూడా నాలుేగ ళ్లు జైలు శిక్ష విధించింది. జయలలితకు రూ. 100కోట్ల భారీ జరిమానా విధించింది.మిగిలిన దోషులు ఒక్కొక్కరికి రూ.10కోట్లు చొప్పున జరి మానా విధించింది. ప్రత్యేక న్యాయస్థానం నాలు ేగళ్లు జైలుశిక్షవిధించడంతో తమిళనాడు ముఖ్య మంత్రి జయలలితకు వైద్యపరీక్షలు నిర్వహిస్తు న్నారు. వీటికోసం ఆమెను ేకంద్ర కారాగారంలో ని ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక కోర్టు తీర్పు పై తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత కర్ణా టక హైకోర్టులో మాత్రమే అప్పీలు చేసుకోవడా నికి అవకాశం ఉంది. తీర్పును సవాలు చేస్తూ ఆ మె అప్పీలుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నా రు. ఈమేరకు ఆమె న్యాయవాదులు ఏర్పాట్లు చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయల లితకు ప్రత్యేక న్యాయస్థానం కఠిన శిక్ష విధించ డంతో ఆమె కోర్టు ఆవరణలోనే స్వల్ప అస్వస్థత కు గురయ్యారు. ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఆమె ఊహించలేదు.ఆదాయానికి మిం చిన ఆస్తుల కేసులో కోర్టు తమకు శిక్ష విధిస్తుం దని జయలలిత ఊహించిఉండవచ్చుగాని తీర్పు ఇంత కఠినంగా ఉంటుందని మాత్రం ఊహించలేకపోయి ఉండవచ్చు. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం పాలనాపరంగా తీసుకోవలసిన చర్యల గురించి జయలలిత ముందుగానే తమ కు విశ్వాసపాత్రులైన అధికారులతో చర్చించినట్టు తెలుస్తున్నది. నాలుగు సంవ త్సరాలు జైలు శిక్ష విధించడంతో ఈ ప్రత్యేక న్యాయస్థానంలో జయలలిత బె యిలు పొందే అవకాశం లేదు. మూడేళ్ల లోపు జైలు శిక్ష గనక పడితే ఏ కోర్టు అయితే శిక్ష విధించిందో అదే కోర్టు బెయిలు కూడా మంజూరు చేయవచ్చు. ఇప్పుడు జయలలితకు బెయిలు రావాలన్నా కనీసం వారం పది రోజులు పట్ట వచ్చునని న్యాయకోవిదులు అంచనా వేస్తున్నారు.శనివారం నాడు కోర్టు తీర్పు వెలువడిందే కోర్టు సమయం ముగిసిపోతున్న చివరి క్షణాలలో. అనంతరం ఆమెను పరప్పన అగ్రహారంలోని జైలుకు తీసుకువెళ్లారు. అక్కడ ఆమెకు వైద్య చికిత్సలు నిర్వహించారు. దసరా కావడంతో ప్రస్తుతం కోర్టులకు సెలవులు. జయలలిత సంపాదించిన ఆస్తులు 66 కోట్ల రూపాయలుగా అంచనా. అయితే ఇంతకుముందే అధికారులు బంగారు ఆభరణాలను, వెండి ఆభరణాలనూ స్వా ధీనం చేసుకున్నారు. ఇప్పుడు కోర్టు విధించిన 100 కోట్ల రూపాయలను జయ ఏ ఖాతానుంచి తీసుకువచ్చి చెల్లిస్తారన్నది అస్పష్టంగా ఉన్నది. అలాగే జయతో పాటు మిగిలిన ముగ్గురు కూడా తలా పది కోట్లు జరిమానా చెల్లించవలసి ఉం టుంది. వారు కూడా ఈ సొమ్మును ఎలా తీసుకువ స్తారన్నది సందేహమే. అం టే ఈ అక్రమాస్తుల కేసులో జరిమానాగా కట్టవలసిన మొత్తం రూ.130 కోట్లకు వీరంతా లెక్కలు చూపవలసి ఉంటుంది. అంటే బ్లాక్‌ మనీగా గాక వైట్‌ మనీ గానే చూపాలి. ముఖ్యమంత్రిగా కేవలం ఒక్క రూపాయినే జీతంగా తీసుకుం టానని జయ ప్రకటించిన నేపథ్యంలో ఇంత మొత్తానికి లెక్కలు చూపడం సాధ్య మా అన్నది ఇపడు మరొక కీలకమైన ప్రశ్న. ఒకవేళ ఆ మొత్తాన్ని చెల్లించ లేకపోతే అపడు శిక్షా కాలాన్ని మరింతగా కోర్టు పొడిగిస్తుందా? అనేది కూడా ప్రశ్నే.ఆదాయానికి మించిన ఆస్తుల ేకసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయ లలితను ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించడంతో తమిళనాడు ఆర్థిక మంత్రి పనీర్‌ సెల్వం కోర్టు హాలులో కంట తడి పెట్టారు. బెంగళూరు చేరుకున్న పలువు రు జయలలిత అభిమానులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. దాదాపు 18ఏళ్ల పాటు సాగిన ేకసు విచారణలో 14 మంది జడ్జిల సమక్షంలో విచారణ జరిగిం ది. 259 మంది ప్రాసిక్యూషన్‌ సాక్షులు, 99 మంది డిఫెన్స్‌ సాక్షుల వాంగ్మూ లాన్ని కోర్టు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగు ళూరు ప్రత్యేక న్యాయ స్థానం సంచలనాత్మక తీర్పు ఇవ్వడంతో కోర్టు దరిదాపు లలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. శిక్ష విధించిన వెంటనే జయలలితను బెంగుళూరు పో లీసులు కస్టడీలోకి తీసుకున్నారు.ఈ తీర్పును న్యాయస్థానం శనివారం మధ్యా హ్నం ఒంటి గంటకే వెల్లడిస్తుందని తొలుత సంకేతాలు వెలువడ్డాయి. అయితే అప్పటికే కోర్టు చుట్టుపక్కల ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో తీర్పు ప్రకటన ఆల స్యమైంది. జయలలిత అనుయాయులు పెద్ద ఎత్తున కోర్టు సమీపానికి చేరు కోవడంతో పోలీసులు చేసిన భద్రతా ఏర్పాట్ల వల్ల ఆ ప్రాంతం మొత్తం కర్ఫ్యూ విధించినట్టుగా మారిపోయింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని 1996లో జయలలితపై ేకసు నమోదైంది. జయలలితతో పాటు ఆమెకి అత్యం త సన్నిహితురాలైన శశికళ, ఆమె కుమారుడు సుధాకర్‌, బంధువు ఇళవరసి కూడా ేకసులో నిందితులుగా ఉన్నారు. అప్పట్లో జయలలిత ఇంట్లో జరిపిన సోదాల్లో 880 కిలోల వెండి, 28కిలోల బంగారం, 10వేలకు పైగా చీరలు, 90కి పైగా వాచీలు, 750 జతల పాదరక్షలు స్వాధీనం చేసుకున్నారు. తమిళ నాడులోని అనేక చోట్ల జయలలిత ఆస్తులు కూడబెట్టారని ఆరోపణలొచ్చాయి. ేకవలం ఒక్కరూపాయి వేతనం తీసుకుని ఇంత ఆస్తి ఎలా కూడబెట్టారని అభి యోగం నమోదైంది.తమిళనాడు సీఎం జయలలితను దోషిగా నిర్దరిం చడంతో అన్నాడీఎంేక కార్యకర్తలు ప్రత్యేక న్యాయస్థానం వద్ద ఆందోళనకు దిగారు. దీం తో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. బెంగళూరులోని పరప్ప న అగ్రహార జైలు పరిసరాల్లోని 5కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: