దాదాపు వృద్ధాప్యంలో పడిన రామ్ జఠ్మలానీ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కేసును టేకప్ చేశాడు. అక్రమ ఆస్తుల కేసు రుజువు అయ్యి.. ఆమె దోషిగా తేలడంతో నాలుగు సంవత్సరాల జైలు శిక్ష వంద కోట్ల రూపాయల జరిమానా పడిన నేపథ్యంలో ఆమెను ఈ వ్యవహారం నుంచి బయట పడేసే బాధ్యతను తీసుకొన్నాడు జఠ్మలానీ. ప్రస్తుతానికి ఆయన జయ బెయిలు పిటిషన్ మీద వాదించనున్నట్టు తెలుస్తోంది. బెయిలు కోసం జయలలిత హై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తరపున లాయర్ రామ్ జఠ్మలానీ ని ఏర్పాటు చేసుకొన్నారట. ఈయన దేశంలోని ప్రముఖ కేసులకు అడ్వొకేట్ గా వ్యవహరించారు. అనేక మంది రాజకీయ నేతల తరపున న్యాయవాదిగా నిలబడ్డాడు. ఇందిరాగాంధీ హత్యకేసుతో సహా అనేక కేసుల్లో జఠ్మలానీ పేరు మార్మోగిపోయింది. మన రాష్ట్రానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి జైలు పాలైన సందర్భంలో కూడా జఠ్మలానీనే న్యాయవాదిగా బరిలోకి దిగాడు. జగన్ తరపున కొంతకాలం పాటు ఆయన వాదనలు వినిపించాడు. అయితే జఠ్మలానీ ఈ కేసు వ్యవహారంలో న్యాయవాది గా వ్యవహరించినప్పుడు జగన్ కు బెయిలు రాలేదు. ఆ తర్వాత కొంతకాలానికి జగన్ జైలు నుంచి విముక్తుడయ్యాడు. ఇప్పుడు జయలలిత కేసుపై కూడా జఠ్మలానీనే బరిలోకి దిగుతున్నాడు. జయకు బెయిలు లభించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని.. శిక్షపై కూడా ఆమె పై కోర్టుకు వెళ్లేందుకు అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జఠ్మలానీ న్యాయవాదిగా బరిలోకి దిగుతున్నాడు. మరి జయకు విముక్తి ఎప్పుడో!

మరింత సమాచారం తెలుసుకోండి: