జడ్పీ చైర్మన్లే అనర్హులు అయిపోతున్నారు. ఇక ఎంపీ, ఎమ్మెల్యేలు గనుక గీత దాటితే వేటు పడటం పెద్ద సమస్య ఏమీ కాదు.. అనే సందేశాన్ని ఇస్తోంది నెల్లూరు జడ్పీటీసీ వ్యవహారం. తాజగా మొత్తం ఎనిమిది మంది జడ్పీటీసీ సభ్యులపై నెల్లూరు కలెక్టర్ అనర్హత వేటు వేశారు. జడ్పీ ఎన్నీకల్లో వైకాపా తరపున గెలిచి చైర్మన్ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం అభ్యర్థికి మద్దతు పలికిన వారి కథ అలా కంచికి చేరింది. నెల్లూరు జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నికల సమయంలో ఎనిమిది మంది సభ్యులు ప్లేటు ఫిరాయించారు. దీంతో మొత్తం వ్యవహారం అడ్డం తిరిగింది. వాస్తవానికి ఇక్కడ వైకాపా 31 జడ్పీ స్థానాలను సొంతం చేసుకొంది. తెలుగుదేశం కేవలం 15 స్థానాలకే పరిమితం అయ్యింది. అయితే ఇటువంటి తరుణంలో వైకాపా తరపున గెలిచిన ఎనిమిది మంది తెలుగుదేశం వైపు చేరిపోయారు. దీంతో ఇరు వర్గాల బలం సమం అయ్యింది. రెండు పార్టీలకూ 23 - 23 మంది చొప్పున బలం కనిపించింది. ఇటువంటి నేపథ్యంలో టాస్ వేసి ఇక్కడ జడ్పీ చైర్మన్ ను ఎన్నుకొన్నారు. అయితే టాస్ తో విజయం వైఎస్సార్ కాంగ్రెస్ ను వరించింది. ఈ నేపథ్యంలో గీత దాటిని ఎనిమది జడ్పీటీసీలపై వైకాపా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. విప్ ను ధిక్కరించిన వారిపై కలెక్టర్ కొరడా ఝలిపించడంతో అనర్హులయ్యారు. మరి జడ్పీటీసీ సభ్యులపైనే కాస్త లేటుగానైనా చర్యలు తప్పలేదు. ఇక ఎంపీ, ఎమ్మెల్యేల విషయంలోనైనా ఇదే జరుగుతుందని చెప్పవచ్చు. నెల్లూరు జడ్పీ సభ్యులపై వేటు అనేది వైకాపా గేటు దాటాలనే వారికి ఒక విధమైన హెచ్చరికగా భావించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: