హైదరాబాద్ అభివృద్ది కి తనే కారణం అని అంటుంటారు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ఆ విషయాన్ని ప్రకటించుకొనే చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ఒప్పుకొంటారో లేదో కానీ.. తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్లు మాత్రం బాబుపై బలమైన ఆరోపణ చేస్తున్నారు. తెలంగాణ విద్యుత్ కష్టాలకు చంద్రబాబే కారణం అని వారు ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేత, తెలంగాణ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ కష్టాలకు తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబే కారణం అని వ్యాఖ్యానించాడు. ముందుగా ఉన్న ఒప్పందాలకు అనుగుణం చంద్రబాబు వ్యవహరించకపోవడంతోనే తెలంగాణకు ఈ కష్టాలు వచ్చాయని ఈయన ఆరోపిస్తున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ రెండుగా విడిపోయిన సమయంలో తెలంగాణకు 53 శాతం విద్యుత్ ఇవ్వాలని ఢిల్లీలో ఒప్పందం కుదిరినప్పటికీ ఆ మాటను చంద్రబాబు లెక్క చేయడం లేదని హరీశ్ రావు అంటున్నాడు. ఈ విధంగా చేస్తున్న చంద్రబాబు కు తెలంగాణ ప్రజల ఉసురు తగులుందని కూడా హరీశ్ రావు శాపనార్థాలు పెట్టారు. మొత్తానికి కరెంటు కష్టాలతో తెలంగాణ ప్రాంతమే కాకుండా టీఆర్ఎస్ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. హైదరాబాద్ కే ప్రభుత్వం సరిగా విద్యుత్ సరఫరా చేయలేకపోతోంది. ఇక పల్లెల సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మరి ఈ వ్యతిరేకతను బాబుకు కూడా పంచాలని టీఆర్ఎస్ వాళ్లు ప్రయత్నిస్తున్నారు. మరి అధి సాధ్యం అవుతుందా?!

మరింత సమాచారం తెలుసుకోండి: