రాఘవేంద్ర రావు. మురళీ మోహన్ లు టీటీడీ చైర్మన్ పదవి పెట్టుకొన్న ఆశలు ఆవిరి అయినట్టేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్ పదవి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాడని కూడా తెలుస్తోంది. చదలవాడ కృష్ణమూర్తిని టీటీడీ చైర్మన్ గా చేయనున్నట్టు సమాచారం. బాబు దాదాపుగా ఈ నిర్ణయానికి వచ్చేసినట్టేనని తెలుస్తోంది. దీంతో మురళీ మోహన్ , రాఘవేంద్ర రావు వంటి బాబు సన్నిహితులు టీటీడీ చైర్మన్ పదవి పై పెట్టుకొన్న ఆశలు ఫలించేలా లేవని సమాచారం. అయితే రాఘ వేంద్ర రావు మాత్రం టీటీడీ కమిటీలో సభ్యత్వం ఇవ్వనునట్టు తెలుస్తోంది. సభ్యుల్లో ఒకరిగా ఈయనకు గౌరవం దక్కనున్నదని సమాచారం. అయితే రాఘవేంద్రరావు, మురళీ మోహన్ లు మాత్రమే కాదు టీడీపీలోని అనేక మంది టీటీడీ చైర్మన్ పదవి మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు. వారికి కూడా ఆశాభంగమేనని చెప్పవచ్చు. గాలి ముద్దుకృష్ణమనాయుడు వంటి టీడీపీ సీనియర్లు కూడా ఈ చైర్మన్ గిరిపై ఆశలు పెట్టుకొన్నారు. అయితే వాళ్లను కాదనకొని.. వారికి వేరే పదవుల హామీలు ఇచ్చి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చదలవాడకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు తిరుపతి ఎమ్మెల్యే పీఠంపై ఆశలు పెట్టుకొన్న చదలవాడకు బాబు అప్పట్లో టీటీడీ చైర్మన్ పదవిని ఆఫర్ చేశారట. అలాగే చాలా మందికి కూడా ఈ పదవిని హామీ గా ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ చదలవాడకు మాత్రమే బాబు న్యాయం చేశారు!

మరింత సమాచారం తెలుసుకోండి: