హైదరాబాద్‌ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవు తుందా..? నగరంలోని ఎమ్మెల్యేలంతా కారెక్కేందుకు సిద్ధమయ్యారా..? త్వర లోనే వీరంతా సైకిల్‌ దిగుతున్నారా..? ఇందుకు అవుననే సమాధానాలు వస్తు న్నాయి. అంతేకాదు అందుకనుగు ణంగానే సంకేతాలు కూడా వెలువడుతున్నా యి.దీంతో తెదేపా నేతలంతా తెరాసలో చేరుతున్నారనే ప్రచారం ఊపందుకుం ది. హైదరాబాద్‌ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీని పూ ర్తిగా భూస్థాపితం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పావులు కదుపుతోంది. ఇందుకుచాపకింద నీరులా తెరాస నేతలు సర్వశక్తులను ఒడ్డుతున్నారు. వీరితో పాటు ఇతర జిల్లాలకు చెందిన తెదేపా ముఖ్యునేతలను కూడా పార్టీలో చేర్చుకు నేందుకు తెరాస చర్యలు తీసుకుంటుంది. ఇందులోభాగంగానే ఇటీవల తెదేపా నేతలు వరుసగా సీఎం కేసీఆర్‌తో భేటి అయ్యారు. ఇందులో ప్రధానంగా తల సాని, ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో పాటు తీగల కృష్ణారెడ్డి కూడా ఈ జాబితాలో వున్నారు. వీరికి మరో ఇద్దరు నేతలు తోడయ్యే అవకాశాలున్నాయనే అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. వీరి జాబితాలోకి ప్రకాశ్‌గౌడ్‌తోపాటు సాయన్నల చేరుతున్నారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. వీరంతా తెదేపా సమ ఉజ్జి లుగా ఎదిగిన నేతలు కావడం కూడా విశేషం. అంతేకాదు ఎమ్మెల్యేలు కావడం కూడా యాదృచ్చికమే. అయితే వీరంతా సైకిల్‌ దిగి కారెక్కెందుకు అన్ని రకాలు గా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు నేతలు నియోజక వర్గంలోని పార్టీ నేతలతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఇందులో రం గారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ముందు వరు సలో వున్నారు. గత వారం సీఎం కేసీఆర్‌ను కలిసిన తీగల తెరాస తీర్థం పుచ్చు కునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం నియోజకవర్గంలోనే తన అ నుచరులతోపాటు పార్టీ నేతలతో గత రెండు రోజులుగా విసృత్తంగా మంతనా లు చేస్తున్నారు.నియోజకవర్గంలోని పార్టీ క్యాడర్‌ కూడా తీగల తెరాసలో చేరేం దుకు సుముఖతను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తెదేపా ముఖ్యనేత, ఎ మ్మెల్యే తీగల కృష్ఱారెడ్డి పార్టీ మారే అంశంపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుం టారని ఆయన అనుచరవర్గం అభిప్రాయపడుతోంది. ఇక ముందు నుంచి తెరా సలో చేరేందుకు తన సంసిద్ధతను వ్యక్తంచేస్తున్న సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని గులాబీ కండువాను కప్పుకునేందుకు మానసికంగా సిద్ధమయ్యారు. అయితే త న కుమారుడి రాజకీయ ప్రవేశంతో ము డిపడిందనే అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. రానున్న గ్రేటర్‌ ఎన్నికల్లో తన కుమారుడికి కార్పొరేటర్‌ సీటును కే టాయించడంతో పాటు మేయర్‌ను చేయాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తల సాని తెరాస తీర్థంవిషయంలో కొంత సందిగ్థత నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇప్ప టివరకు మూడుసార్లు సీఎం కేసీఆర్‌ను తలసాని కలిశారు. దీంతో తలసాని తె రాసలో చేరుతారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు తలసాని నోరు మెదపకపోవడానికి కూడా ఇదో కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. సికింద్రబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సాయన్నతోపాటు రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌ కూడా తెరాసలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. వీరు ఇప్పటి వరకు సీఎం కలిసిన దాఖ లాలు లేవు. అయి తే తలసాని, తీగల, సాయన్న, ప్రకాశ్‌గౌడ్‌లు తెదేపా సమవుజ్జిలుగా కావడంతో వీరంతా కలిసి ఒకనిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు వాదనలు కూడా విని పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వీరు కూడా తెరాస తీర్థం పుచ్చుకుంటారనే అభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తెదేపా నుంచి తెరాసలో చేరుతున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా వుండేందుకు తెరాస తగిన సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంఖ్యలో మూ డో వంతు ఎమ్మెల్యేలు తెరాసలో చేరితే వారిపై అనర్హత వేటు పడే అవకాశం లేదు.ఈ సంఖ్యనే కేంద్రంగా చేసుకొని తెరాస నేతలు తెదే పా ఎమ్మెల్యేపై వల వేస్తున్నట్లు సమాచారం. పార్టీలో చేరిన ప్రతి ఎమ్మెల్యేకు తగిన గుర్తింపు కలిగి న పదవినిలేదా బాధ్యతలను అప్పగించేందుకు కూడా కేసీఆర్‌ సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఎమ్మెల్యేల చేరికకు సంబంధించి నేరుగా ముఖ్య మంత్రి కేసీఆరే వారితో మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం ఇతర జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో కూడా తెరాస నేతలు మం తనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందు లో ప్రధానంగా తెలంగాణలో పార్టీ ముఖ్యనేతగా వున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు తెరాసలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన సీఎం కేసీఆర్‌ను కూడా కలిశా రు. ఇది బహి రంగ రహాస్యమే అయినా తెలంగాణలో తెదేపాలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటల వల్లనే ఎర్రబెల్లి పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారనే అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి.సీఎం కేసీఆర్‌ కలయికపై ఎర్రబెల్లి మీడియాకు సంజాయిషి ఇచ్చుకున్న సోమవారం వరంగల్‌ జిల్లా జడ్పీ సమావేశంలో తెరాస లో చేరేందుకు ఎర్రబెల్లి సిద్ధమయ్యారనే విషయాన్ని ఎంపీ కడియం శ్రీహరి స్పష్టం చేయడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: