టిఆర్‌ఎస్‌ ఎంపి కడియం శ్రీహరి..టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావుల మద్య సోమవారం జడ్పి సమావేశంలో యూరియా కొరతపై వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువురు నేతలు పరస్పర దూఫనలకు దిగటంతో చర్చించాల్సిన అంశం కాస్త పక్కదారి పట్టింది. వరంగల్‌ జిల్లాలో యూరియా కొరతపై ప్రతిపక్ష సభ్యులు నిలదీశారు. దీంతో ఎంపి కడియం కలగజేసుకుని సర్ధి చెప్పారు. అనంతరం జరిగిన పరినామాలతో సమావేశం కాసేపు రసాబసాగా మారింది. అనంతరం 2014/15 సంవత్సరానికి గాను 32.47కోట్ల బిఆర్‌జిఎఫ్‌ నిదులకు ప్రణాలిక రూపొందించినట్లు కలెక్టర్‌ జి కిషన్‌ తెలిపారు. సోమవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్‌ కిషన్‌, చైర్‌పర్సన్‌ గద్దల పద్మ బిఆర్‌జిఎఫ్‌ 2014/15ఆర్ధిక సంవత్సరానికి రూపొందిన ప్రణాలికను అమోద నిమిత్తం జిల్లా ప్రణాళిక కమిటికి సమర్పించారు. కమిటి సభ్యులలో రావుల రవిచందర్‌రెడ్డి, భూర ముత్తిలింగం అదేవిదంగా ప్రత్యేక ఆహ్వనితులలో వరంగల్‌ ఎంపి కడియం శ్రీహరి, మహబుబాద్‌ ఎంపి సీతారాంనాయక్‌, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హజరై ప్రణాళికను ఆమోదించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ కిషన్‌ మాట్లాడుతు జనాబా ప్రాతిపధికన బిఆర్‌జిఎఫ్‌ నిదులు మంజూరు అయ్యాయని దానికి అనుగుణంగానే పణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. నిదులలో 50శాతం గ్రామపంచాయితి, 30శాతం మండల, 20శాతం జిల్లా పరిఫత్‌కు నిదులు వినియోగించాల్సి ఉన్నందున గ్రామసభల తీర్మాణాలు, మండల ప్రజాపరిషత్తు సభల తీర్మాణాలు, జిల్లా ప్రజాపరిషత్‌ సభ్యులు ప్రతిపాదించిన పనులు అదేవిదంగా పట్టణ స్థానిక సంస్థల తీర్మాణం చేసిన పనులు పరిగణంలోకి తీసుకున్నామన తెలిపారు. గ్రామపంచాయితి సెక్టార్‌లలో 1026పనులకు 1140లక్షల 86వేలు, ప్రజాపరిశత్‌ సెక్టార్‌లలో 658పనులు 684లక్షల 51వేలు, జిల్లా ప్రజాపరిశత్‌ సెక్టార్‌లలో 264పనులకుగాను 456లక్షల 34వేలు, పట్టణస్థానిక సంస్థలలో 65పనులకు 965లక్షల29వేలు మోత్తం 32.47కోట్లు అబివృద్ది పనులకు కేటాయించడం జరిగిందన్నారు. అదేవిందగా ప్రభుత్వం ఆదేశాల మేరుకు 50శాతం అదనపు ప్రణాళికలను రూపొందించడం జరిగిందన్నారు. అధనపు ప్రణాళికలో బాగంగా గ్రామపంచాయితి సెక్టార్‌లలో 1003పనులకు 570లక్షల 43వేల నిదులు, మండల పరిషత్‌లో 535పనులకు 342లక్షల 26వేలు, జిల్లా ప్రజాపరిషత్‌ పరిధిలో 182పను లకు 228లక్షల 17వేలు, పట్టణ స్థానిక సంస్థలు 85పనులకు 482లక్షల 64వేల నిదులు మోత్తం 1805పనులకు 1623లక్షల యాబై వేల నిదులతో 50శాతం అధనంగా ప్రణాళికలు రూపొందించినట్లు సూచించారు. ఇందులో షెడ్యూల్డు కులాల అబివృద్దికి 383పనులు, 349లక్షల 53వేల నిదులు, షెడ్యూల్డు తెగలకు 376పనులు 339లక్షల 92వేల నిదులు సాధారణ ప్రణాళికకు 1046పనులకు గాను 934.05 నిధులతో ప్రణాళికలు రూపొందిచినట్లు ఆయన తెలిపారు.కమిటి సమావేశంలో జడ్‌పి సిఈవో వెంకటేశ్వర్లు, సంబందిత అధికారులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: