రైతుల రుణమాఫీ వ్యవహారంలో బ్యాంకర్లు పోషి స్తున్న పాత్రపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గడచిన మూడు మాసాలుగా ప్రభుత్వం రు ణమాఫీపై ఎంత కసరత్తు చేసినా ఉపయోగం కనబడటం లేదు. రుణా లు తీసుకున్న రైతుల జాబితాలను బ్యాంకులు ఇవ్వని కారణంగా ఇప్ప టికి కూడా రుణమొత్తం ఎంత అన్న దానిపై ప్రభుత్వానికి స్పష్టత రావ టం లేదు. ఇదే విషయమై గతంలో కూడా చంద్రబాబు ఎంత గట్టిగా చెప్పినా బ్యాంకర్లలో మార్పు లేదు. ఇదే విషయమై చంద్రబాబు బ్యాంక్‌ ఉన్నతాధికారులను నిలదీసినట్లు సమాచారం. జాబితాలను అంద చే యటానికి ఎప్పటికప్పుడు బ్యాంకర్లు గడువు కోరుతున్నారే గానీ ప్రభు త్వం అడుగుతున్నట్లు జాబితాలను మాత్రం అందించటం లేదు. దీనివ ల్ల ప్రభుత్వం రుణాల మొత్తాన్ని ఏమేరకు సమీకరించాలో అర్ధం కావ టంలేదు. ఒకవైపు రుణమాఫీకి భారత రిజర్వ్‌బ్యాంకు,కేంద్ర ప్రభుత్వం సహకారం అందించక పోవటంతో చంద్రబాబులో అసహనం పెరిగిపో తోంది. దీనికి తోడు రుణాల జాబితాలను ఇవ్వటంలో రాష్ట్రంలోని బ్యాం కులూ సహకరించటం లేదు. మంగళవారంనాడు బ్యాంకర్లు సమావే శం అవుతున్నారు. ఈ సమావేశంలో వారు నిర్ణయం తీసుకునే అవకా శం కనిపిస్తున్నది. అక్టోబర్‌ 2వ తేదీ నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోంది. వీటి ప్రచారానికి మంత్రు లు, శాసనసభ్యులు,పార్లమెంట్‌ సభ్యులు దాదాపు పక్షం రోజులు ప్రజల్లోనే గడపాల్సి ఉంటుంది. అయితే, తమను విజయతీరాలకు చేర్చిన రుణమాఫీ హామీని ఇప్పటి వరకూ ప్రభుత్వం నిలబెట్టుకోకపోవటంపై రైతుల్లో ఆగ్రహం మొదలైంది. రుణమాఫీని ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోవటంతో ఖరీఫ్‌ సీజన్‌లో ఏ బ్యాంకు కూడా రైతులకు రుణాలు ఇవ్వలేదు. అలాగే, డ్వాక్రా రుణమాఫీని కూడా ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. ఇవి రెండు నెరవేర్చకుండా ఇపుడు ప్రజల్లో తిరగటం కష్టమని మంత్రులు, ప్రజాప్రతినిదులుచంద్రబాబుకు స్పష్టం చేశారు. ఒక వైపు అసాధ్యంగా మారిన రుణమాఫీ, మరోవైపు సంక్షేమ పథకాల అమలుకు గడువు దగ్గర పడుతోంది. దాంతో ఏమి చేయాలో చంద్రబాబుకు పాలుపోవటం లేదు. అందుకనే సోమవారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. దాదాపు ఐదు గంటల పాటు సమావేశం జరిగినా ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉన్నట్లు తెలిసింది. రుణమాఫీ సమస్య నుండి బయట పడాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే, అలవికాని ప్రతిపాదనలకు తలొగ్గే అవకాశం లేక బ్యాంకులు తమ వాదనకే కట్టుబడిఉన్నాయి. దాంతో రుణమాఫీ అన్నది ఎక్కడవేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు తయారైంది.ఈ విషయంపైనే చంద్రబాబు సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జాబితాలు ఇవ్వటానికి ఇంకా ఎంత కాలం పడుతుందని తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే, బ్యాంకర్లు మాత్రం పూర్తి జాబితాను అక్టోబర్‌ 10వ తేదీ కల్లా అందిస్తామంటూ తాజాగా మరో గడువు కోరారు. అయితే కానీ సమావేశంలో ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు దేనికి కూడా అంగీకరించలేదు. పై పెచ్చు మంగళవారం జరిగే రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల సమావేశంలో చర్చించుకుని సమాధానం ఇస్తామన టం గమనార్హం. ప్రభుత్వం కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ. ఏడు వేల కోట్లు అందులోజమ చేస్తే బ్యాంకులకు ఏ విధంగా లాభం కలుగుతుందోనన్న విషయమై బ్యాకర్లు సమావేశంలో చర్చించనున్నారు.ఏ బ్యాంకైనా రిజర్వ్‌బ్యాంకు నిబంధనలు, మార్గదర్శకాలపై పనిచేయాల్సిందే కాని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినట్లు వినే అవకాశం లేదు. ఈ విషయం తెలిసీ చంద్రబాబు బ్యాంకర్లతో సమావేశం పెట్టుకుంటూ పోవటం వల్ల ఉపయోగం ఏమిటన్నది ఎవరికీ అర్ధం కావటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: