వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీలకు ఆడిటర్‌గా వ్యవహరిస్తూ ఆర్థిక వ్యవహారాల వ్యూహకర్తగా పనిచేస్తూ వచ్చిన విజయసాయి రెడ్డి ఇప్పుడు పార్టీ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించాక పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్‌ కంపెనీల అడిటర్‌, సన్నిహితుడు విజయసాయి రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం 8 గంటలకే పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్న ఆయన నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం నాడు రైతు, బీసీ విభాగాల నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకలాపాలను ఇకపై లోటస్‌పాండ్‌లోని తన ఇంటి నుంచే నిర్వహించాలన్న యోచనలో పార్టీ అధ్య క్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఉన్నారు. పార్టీ ముఖ్యనేతలతో జరిగే అత్యంత ముఖ్యమైన సమావేశాలను తన నివాసంలోనే జగన్‌ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అద్దె భవనంలో ఏర్పాటు చేసిన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ దైనందిన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అద్దె భవనంలో కంటే తన నివాసంలోనే వాటిని కొనసాగించడం మేలన్న అభిప్రాయానికి జగన్‌ వచ్చారని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: