రాజకీయాలలో ప్రభంజనంలా తెరపైకి వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అనతి కాలంలోనే సొంత నేతల వలసలతో చితకిలపడింది. ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరుతో ప్రధాన ప్రతిపక్షాన్ని మరింత నిర్వీర్యం చేయాలని భావించిన టిడిపి తన లక్ష్యసాధనలో ముందుకెళ్తుంటే వాటిని ఢీకొనేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సిద్దమవుతోంది. మొన్నటి వరకు పోతే పోని అని తన పార్టీ నుంచి టిడిపిలోకి వలసలు పోతున్న సొంత నేతలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చూసిచడనట్లు వ్యవహరించింది. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీకి భవిష్యత్తు ఉండదన్న ఆ పార్టీ సీనియర్ల సూచనతో పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల తరువాత కొందరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు టిడిపి వైపునకు మొగ్గు చూపిన విషయం తెలిసిందే. అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అదే తరహాలో జగన్‌పై అక్రమాస్తుల కేసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్‌ బెంగతో 30 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ముకుముడిగా టిడిపిలోకి వెళ్లే అవకాశముందని కూడా ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే సభలో పార్టీ బలహీనపడటమే కాకుండా ప్రజల్లో దీనిపై తప్పుడు సంకేతాలు వెళ్లి పార్టీ మరింత బలహీనపడే ప్రమాదముందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం భావించినట్లు సమా చారం. ఈ నేపథ్యంలో దిద్దుబాట చర్యలకు ఆ పార్టీ నాయకత్వం దిగుతోంది. బుజ్జగింపు చర్యలు? టిడిపి ఆపరేషన్‌ ఆకర్ష్‌కు విలవిలలాడిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం పార్టీలోని అసంతృప్తులను బుజ్జగించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. పార్టీ నుంచి ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి వెళ్లే యోచన చేస్తుప్నట్లు సమాచారం తెలుసుకొన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. ఇలా పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే వారిపై అనర్హత వేటుకు అవకాశం ఉండదని ఆ అసంతృప్త ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు మీడియాలో ప్రచారం సాగింది. ఇదే జరిగితే పార్టీ ఉనికే ప్రమాదమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ తరుణంలో పార్టీలో ఎవరెవ్వరూ అసంతృప్తితో ఉన్నారో ఆ ఎమ్మెల్యేతో నేరుగా మాట్లాడేందుకు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సిద్దమైనట్లు సమాచారం. వారిలో ఉన్న అసంతృప్తిపైఆరాతీయ డంతోపాటు అందుకు గల కారణాలను కూడా ఆ ఎమ్మెల్యేలతో మచ్చటించే సందర్భగా పార్టీ అధ్యక్షుడు కూఫీ లాగే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ ముఖ్యనేత ఒకరు పేర్కొంటున్నారు. ఇలా పార్టీలో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలందరితోనూ వ్యక్తిగతంగా విడివిడిగా చర్చలు సాగించాలని జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. పార్టీని వీడి టిడిపిలో చేరడం వల్ల చేజేతులారా భవిష్యత్‌ను నాశనం చేసుకోవడమేనని, అక్కడ గాడ్‌ ఫాదర్‌ అంటూ లేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని అసంతృప్తి ఎమ్మెల్యేలకు నచ్చజెప్పే కార్యక్రమం మొదలెడుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో టిడిపి సర్కార్‌కు ఏకైక ప్రతిపక్షంగా ఉన్న తమకే ఐదేళ్ల తరువాత అధికారం వస్తుందని అసంతృప్త ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చే కార్యక్రమానికి జగ న్మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్టీకి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా ఏకైక బలమైన ప్రతిపక్షంగా ప్రజలు మెజార్టీ తమ పార్టీకే ఇచ్చారని ఎమ్మెల్యేలకు వివరించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకత్వం సమాలోచనలు చేస్తోంది. పార్టీని వీడితే సొంత పార్టీతో సంబంధాలు తెగిపోవడమే కాకుండా టిడిపిలో ఒంటరి వారుగా మిగలాల్సి వస్తుందని జగన్మోహన్‌రెడ్డి తన పార్టీ ఎమ్మెల్యేలకు సూచనలు ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇకపై నిరంతరం చర్చలు ? పార్టీని బతికించుకోవాలంటే పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవడం చాలా అవసరమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి పలు వురు పార్టీ సీనియర్లు సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోపార్టీ క్యాడర్‌ ఎక్కడా చేజారకుండా అవసరమైతే నేరుగా వారితో చర్చలు జరపాలని వైఎస్సా ర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. పార్టీలో ఓ స్థాయి ఉన్న నాయకుడిని సైతం నేరుగా చర్చలు జరిపి అతనిలో నెలకొన్న అసంతృప్తిని దూరం చేయాలని జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: