ప్రధాని నరేంద్ర మోడీపై దేశప్రజలు పెట్టుకున్న ఆశలు అన్నీ ఇన్నీ కావు. ఐదేళ్లు అధికారమిస్తే.. 60 ఏళ్ల వెనుకబాటు తనాన్ని పోగొడతానన్న ఆయన మాటలు నమ్మిజనం గత ఎన్నికల్లో ఎన్నడూ లేనన్ని సీట్లు కట్టబెట్టి అధికారం అప్పగించారు. మరి మోడీ పాలన ఎలా ఉంది. ప్రజల అంచనాలను ఆయన అందుకుంటున్నారా.. మోడీది ప్రచార ఆర్భాటమేనా.. ప్రజా సంక్షేమం ఏమైనా ఉందా.. ఈ ప్రశ్నలకు సమాధానం ప్రజాభిప్రాయమే చెబుతుంది. మొన్నటి ఉప ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీకి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. సరే.. ఉపఎన్నికలు కాబట్టి వాటి ఫలితాలను పక్కకుబెడితే... ఇప్పుడు మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు కమలనాథుల గుండెళ్లో గుబులురేపుతున్నాయి. ఈసారైనా సానుకూల ఫలితాలు వస్తాయా.. రావా అని ఎదురుచూస్తున్నారు. ఐతే వారు అంతగా భయపడాల్సిందేమీలేదంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఈ రెండు రాష్ట్రాలు బీజేపీ ఖాతాలో చేరిపోవడం ఖాయమని అవి తేల్చిచెబుతున్నాయి. రెండు చోట్లూ బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అన్ని సర్వేలూ బీజేపీకి అనుకూలంగానే రావడం విశేషం. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోయినప్పటికీ బీజేపీ అతిపెద్దపార్టీగా అవిర్భవిస్తుందని చాలా సర్వేలు చెప్పాయి. మొత్తం 288 అసెంబ్లీసీట్లున్న మహారాష్ట్రలో మ్యాజిక్ మార్క్ 145. టుడేస్ చాణక్య, ఏబీపీ నీల్సన్ రెండురాష్ర్టాల్లోనూ బీజేపీ ఒంటరిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపాయి. టైమ్స్ నౌ-సీ ఓటర్ సర్వేలోలో మాత్రం బీజేపీకి 129 సీట్లే వస్తాయని.. అంచనా వేసింది. మెజారిటీ వస్తుందా రాదా అన్న విషయం పక్కకు పెడితే.. ఎన్నికల తర్వాత బీజేపీ సొంతంగా కానీ.. మిత్రుల అండతో కానీ.. అధికారం చేపట్టడం మాత్రం ఖాయమని తేలిపోయింది. తుది ఫలితాలు మాత్రం ఆదివారం తేలిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: