వచ్చే ఐదేళ్లల్లో నైపుణ్యం కలిగిన యువతకు డిమాండ్ పెరుగుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ‘దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ శ్రమేవ జయతే’ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. మన యువతకు ఉద్యోగాలు కావాలని, పారిశ్రమికవేత్తలకు పనిచేసేవారు కావాలని చెప్పారు. కాబట్టి దేశంలో ఐటీఐలను పరిపుష్టం చేయాలని… వ్యవస్థలో మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు., దేశంలో తయారయ్యే ప్రతి వస్తువు వెనుక పేదవాడి శ్రమ ఉంటుందన్నారు. కావున శ్రామికులే దేశ నిర్మాతలని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను వారి కోణంలోనే చూడాలని చెప్పారు. తరువాత శాశ్వత ఖాతా సంఖ్య, కార్మికుల తనిఖీ పథకాలను కూడా మోడీ ఆరంభించారు. సత్యమేవ జయతే ఎంత శక్తిమంతమో శ్రమేవ జయతే కూడా అంతే శక్తిమంతమైనదని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు. ఈ-గవర్నెన్స్ ద్వారానే పారదర్శకత సాధ్యమన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: