పార్టీలకు అతీతంగా అందరూ మాటలు తగ్గించి చేతలతో హుదూద్ బాదితులకు సేవచేయాలి అని చెపుతూ నిన్న సాయంత్రం విశాఖపట్నంలో తుఫాను బాదితులను పరామర్శించి ఆ తరువాత మీడియాతో మాట్లాడిన పవన్ అనుకోకుండా తన నోటి వెంట వచ్చిన ఒక మాటతో తన ఆలోచనలను తెలిసి వచ్చేలా సంకేతాలు ఇచ్చాడు. 'ఈ దుస్థితిని చూస్తోంటే పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందనిపిస్తోంద' ని వ్యాఖ్యానించాడు పవన్. అనుకోకుండా అన్న ఈ మాటలలో పవన్ వ్యూహాత్మక భవిష్యత్ ఎత్తుగడ ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. మంచినీళ్ళు, ఆహారం వంటి నిత్యావసరాలు కూడా లేక పస్తుతులతో సతమతమవుతున్న సామాన్య జనం విశాఖపట్నంలో పవన్ ను చూడగానే అప్పటి దాకా ఉన్న వారి బాధను మరిచిపోయి పవన్ ను చూడటానికి ఎగపడటం చూస్తే ప్రజలు అనుభవించే బాధలను కూడా మరిపించే శక్తీ పవన్ కు ఉందా అనే ఆలోచన ఎవరికైనా వస్తుంది. సహాయ కార్యక్రమాలు జరుగుతున్న ఈ పరిస్థుతులలో తాను రాకూడదు అనుకున్నానని అయితే ఇటువంటి పరిస్థుతులలో కూడా మమ్ములను పట్టించుకోడా అనే భావన రాకుడదనే ఉద్దేశ్యంతో ప్రజలకు మానసిక ధైర్యం చెప్పడానికి తాను వచ్చాను అని చెప్పడం వెనుక పవన్ చాల వ్యూహాత్మకంగానే వ్యవహరించి తాను ఏమి రాజకీయలకు దూరం కాలేదు అనే స్పష్టమైన సంకేతాలు పవన్ వ్యవహార శైలి వలన తెలుస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: