సార్వత్రిక ఎన్నికల సమయంలో యూపీలో పార్టీ జెండా పాతడానికి అనువైన పరిస్థితులను కల్పించడంలో సక్సెస్ అయ్యాడు. అక్కడ భారతీయ జనతా పార్టీకి ఊహించని స్థాయి విజయాన్ని సాధించి పెట్టడానికి అమిత్ షా కృషి చేశాడు. ఆ కష్టానికి తగ్గట్టుగా ఆయనకు పార్టీ జాతీయాధ్యక్ష పదవే దక్కింది. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా పార్టీని బలపరిచే పనిని పెట్టుకొన్నాడాయన. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, హర్యానాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ప్రత్యేకించి మహారాష్ట్రలో మోడీ, అమిత్ షాలు కొత్త రాజకీయానికి తెరలేపారు. పాతికేళ్లుగా మిత్రపక్షంగా ఉన్న శివసేనను పక్కనపెట్టి ఒంటరిగా తేల్చుకొన్నారు. అందుకు తగ్గట్టుగా ఫలితాలు పాజిటివ్ గానే ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం చూస్తే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అతి పెద్దదిగా నిలవబోతోంది. ఇక హర్యానాలో కూడా పార్టీకిఅనుకూల పరిస్థితే ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో అమిత్ షా కొత్త టార్గెట్ పెట్టుకోనునట్టు తెలుస్తోంది. ఆయన తమిళనాడులో పార్టీ జెండా పాతడాన్నేతదుపరి లక్ష్యంగా పెట్టుకోనున్నాడట. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు పూర్తిగా తీరిక దొరికిందని అమిత్ షా ఇక తమిళనాడు మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి తమిళనాడులో ఇప్పుడు రాజకీయంగా బలపడటానికి అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. ఇక్కడ ముఖ్యమంత్రి జయలలిత జైలు పాలవ్వడం, డీఎంకే కు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో బీజేపీ ట్రయల్స్ వేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అందుకు తగ్గట్టుగా బీజేపీ అధినేత కొత్త ప్లాన్ లతో బరిలోకి దిగుతున్నాడట. రజనీకాంత్ ను పార్టీలోకి ఆహ్వానించే వ్యూహం కూడా ఉందట. మరి ఉత్తరాదిన సక్సెస్ అయిన షా ఫ్లాన్లు దక్షిణాదిన ఏ మేరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: