తెలంగాణ ముఖ్యమంత్రి తన మంత్రివర్గాన్ని విస్తరించడానికి ఆలోచిస్తున్నారని సమాచారం వస్తోంది. మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు,సీనియర్ ఎమ్మెల్యేలు కొప్పలు ఈశ్వర్, లక్ష్మారెడ్డిలకు మంత్రి పదవులు చాన్స్ దక్కవచ్చు.ప్రస్తుతం తెలంగాణలో ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు మంత్రివర్గ ప్రాతినిధ్యం లేదు. ఈ నేపద్యంలోఆ రెండు జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించవచ్చని భావిస్తున్నారు. అయితే మహబూబ్ నగర్ కు చెందిన శ్రీనివాసగౌడ్ కు మంత్రి పదవి ఇస్తామని గతంలో కెసిఆర్ ప్రకటించారు. ఆయనకు ఇవ్వకుండా లక్ష్మారెడ్డికి ఇస్తారా అన్న చర్చ ఉంది. అలాగే గిరిజన ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వలేదు. మరి చందూలాల్ కు మంత్రి పదవి ఆశిస్తున్నారు.ఈ నెల ఇరవై రెండున మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: