ఎపిలో చంద్రబాబు ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులు బీమా సదుపాయం నష్టపోయారని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. దీనివల్ల రైతులకు ఆర్ధికంగా భారం పడుతుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శాసనమండలి సభ్యుడు రుద్రరాజు పద్మరాజు అన్నారు.వెంటనే కేంద్రంతో సంప్రదించి,ఎపి రైతులందరికి బీమా సదుపాయం కల్పించేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రదానమంత్రి మోడీ ఇచ్చిన వెయ్యి కోట్లు సరిపోవని, కనుక ఐదు వేల కోట్ల రూపాయలను వెంటనే కేంద్రం తుపాను ప్రాంతాలకు సాయంగా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.తుపాను నష్టం డెబ్బైవేల కోట్లుగా అంచనా వేస్తున్న తరుణంలో ఈ డబ్బు సరిపోదని ఆయన అన్నారు.ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈ మాత్రం అడగకపోతే ఎలా అనుకున్నట్లున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: