షాపింగ్ ఆన్ లైన్…డిన్నర్ ఆర్డర్ ఇవ్వడం ఆన్ లైన్…పిల్లల నుంచి పెద్దల వరకు అవసరమయ్యే అన్ని ఐటమ్స్ ఆన్ లైనే. ఈ ఆన్ లైన్ మంత్రంతో షాపుల్లో జనాలు ఖాళీ అయిపోయారు. ఆన్ లైన్ మాయకు వెజిటెబుల్స్ కూడా కంప్యూటర్ లోనే ఆర్డర్ ఇస్తున్నారు. ఆఖరికి మటన్ , చికెన్ కూడా ఆన్ లైన్లోనే. పండగలొస్తున్నాయి. మార్కెట్ కు పోవాలి. గొర్రెలు కొనాలి. ఇంటిల్లపాది తినాలి. తింటున్నపుడు బాగున్నా…గొర్రెలు కొనడానికి పడే కష్టాలు అన్ని ఇన్ని కాదు. ఇక పై గొర్రెలు కొనడానికి బాధ పడనక్కర్లేదు. అసలు మార్కెట్ కే వెళ్లనవసరం లేదు. ఇంట్లో ఇంటర్నెట్ ఉంటే చాలు. ఆర్డర్ ఇవ్వడం… బెస్ట్ గొర్రెను ఇంటికి డెలివరీ చేయించుకోవడం. అవును ఇప్పుడు ఈ మార్కెట్లో గొర్రెల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆన్ లైన్లో ఫోన్స్, మిక్సీలు, ఏసీలు కొనుక్కుంటున్నట్లు గొర్రెలు కూడా ఆన్ లైన్లో కొనేసుకోవచ్చు. గొర్రె బరువు, హైట్, బ్రీడ్ అన్ని వివరాలు ఆన్ లైన్లో పెడతారు. నచ్చితే ‘బై నౌ’ క్లిక్ చేయాలి. క్రెడిట్ కార్డుతో బిల్ పే చేయడం అంతే…కాలు కదపకుండా గొర్రెలు ఇంటికొచ్చేస్తాయి. అవసరం లేకపోతే ఆర్డర్ కూడా కాన్సిల్ చేసుకోవచ్చంటున్నారు ఆర్గనైజర్లు. ఈ ఆన్ లైన్ గొర్రెల వ్యాపారం బక్రీద్ నుంచే జోరందుకుందంట. అంతే కాదు ఈ వ్యాపారంలో మహారాష్ట్రకు చెందిన గొర్రెల వ్యాపారులే ఉన్నారట. వీటితో పాటు… ఈ మధ్య బుజ్జి కుక్కపిల్లలు, పెట్ బర్డ్స్ , అన్ని ఆన్ లైన్లోనే. ఇవి కూడా ఎక్కువ బర్త్ డే గిఫ్ట్ గా ప్రజెంట్ చేస్తున్నారట.. భళా ఆన్ లైన్.

మరింత సమాచారం తెలుసుకోండి: