మహారాష్ట్రలో బీజేపీ అధికారంలోకి వస్తే.. దేవేంద్ర ఫడ్నవిస్ నే.. సీఎంగా కోరుకుంటున్నట్టు..ప్రధాని నరేంద్రమోదీ.. పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ సీనియర్లు.. వినోద్ తావ్డే, ఏక్నాథ్ ఖడ్సే సీఎం కుర్చీకోసం రేస్ లో ఉన్నప్పటికీ.. ఓ యంగ్.. స్టూడియస్ ఫేస్ కే ..ఛాన్స్ ఇవ్వాలన్నది మోదీ ఛాయిస్ గా ఉంది. క్లీన్ చిట్ ఇమేజ్ ఉన్న ఫడ్నవిస్.. మోడీ ఫస్ట్ ఛాయిస్ గా నిలిచారు. డైనమిక్ లీడర్ గా మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు.. దేవేంద్ర ఫడ్నవిస్ ను బీజేపీ మొదటి నుంచీ ప్రొజెక్టు చేస్తోంది. ఇందులో భాగమే.. ఫడ్నవిస్ ను మోదీతోపాటు అన్ని అడ్వర్టయిజ్ మెంట్లలోనూ.. విస్తృతంగా ప్రచారం చేశారు. మహారాష్ట్ర బీజేపీలోని రెండు వర్గాలైన.. నితిన్ గడ్కరీ, గోపీనాథ్ ముండే గ్రూపులకు.. ఫడ్నవిస్ ఆమోదయోగ్యుడు కావడం కూడా కలిసివచ్చే అంశం. గోవా సీఎం.. మనోహర్ పారికర్ లాంటి .. క్రెడిబుల్, యంగ్ ఫేస్ లు.. తన డ్రీమ్ -సీఎంల క్లబ్ లో .. కావాలని మోదీ భావిస్తున్నారు. ఫడ్నవిస్ కు మహారాష్ట్ర సీఎం బాధ్యతలు అప్పగిస్తే.. పార్టీకి కూడా మంచి భవిష్యత్ ఉంటుందని.. మోడీ అంచనా. అందుకే.. దేవేంద్ర ఫడ్నవిస్ ను.. నెక్ట్ సీఎంగా అధికారికంగా ప్రకటించకుండానే.. ప్రొజెక్ట్ చేసింది. కేంద్రం నరేంద్ర, రాజ్యత్ దేవేంద్ర అంటూ.. మహారాష్ట్ర బీజేపీ నేతలు పదేపదే పలు చోట్ల అధికారికంగా ప్రచారం చేయడంలోని ఆంతర్యం ఇదే. లోక్ సభ ఎన్నికల్లో పార్టీని విజయబాటలో నడిపించడంలో ఫడ్నవిస్ పాత్ర చాలా కీలకమైంది. ఒకరకంగా మోదీకి కేంద్రంలో స్పష్టమైన మెజార్టీ వచ్చేలా.. మహారాష్ట్రలో పార్టీ ఆవిర్భవించడం వెనకున్న వ్యక్తి ఫడ్నవిస్. 44 ఏళ్ల దేవేంద్ర ఫడ్నవిస్., పార్టీలో చాలా వేగంగా ఎదిగారు. 1992లో రాజకీయ జీవితం ప్రారంభించి.. నాగ్పూర్ మున్సిపల్ -కార్పొరేషన్ కు రెండుసార్లు కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. దేశంలో అతి పిన్నవయస్సులోనే మేయర్ గా బాధ్యతలు చేపట్టిన రెండవ వ్యక్తిగా రికార్డ్ -సృష్టించారు. 1999నుంచీ ఎంఎల్ ఏగా, బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా.. ABVPతో సాన్నిహిత్యాన్ని నెరపినవాడిగా..ఫడ్నవిస్ కు పార్టీలో మంచి ట్రాక్ రికార్డ్- ఉంది. కాంగ్రెస్-ఎన్సీపీపై విమర్శిస్తూ.. గత ఏడాది ఏప్రిల్ లో పార్టీ చీఫ్ గా పగ్గాలు చేపట్టి.. పలు కుంభకోణాలను వెలుగులోకి తెచ్చిందికూడా ఈయనే. నాగపూర్ కు చెందిన బ్రాహ్మణుడైన దేవేంద్ర ఫడ్నవిస్.. న్యూ ఏజ్ లీడర్ గా.. పార్టీలో పేరుగాంచారు. ఆర్ ఎస్ ఎస్ తో ఈయనకు చక్కని సంబంధాలుండడం మరో ప్లస్ -పాయింట్ గా చెప్పొచ్చు. అపోజిషన్ లీడర్ వినోద్ తావ్డే, మాజీ ఆర్థికశాఖామంత్రి ఏక్నాథ్ ఖడ్సే, గోపీనాథ్ ముండే కుమార్తె పంకజా ముండే సీఎం రేసులో ఉన్నప్పటికీ.. అత్యధికులు.. ఫడ్నవిస్ వైపే ఉండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: