తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మంత్రివర్గ విస్తరణకు సిద్ధ పడటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ చేయనున్నడా? పునర్వ్యస్థీకరణ చేయనున్నాడా? అంటే.. ఆయన తీరును, మాటలను బట్టి చూస్తే జరగబోయేది క్యాబినెట్ పునర్వ్యస్థీకరణనే అని స్పష్టం అవుతోంది. పదకొండు మంత్రి మంత్రులతో మొదట క్యాబినెట్ ను ఏర్పాటు చేసిన కేసీఆర్ ఇప్పుడు దాన్ని విస్తరించడంతో పాటు, కొంతమందిని తప్పించే అవకాశాలున్నాయని కూడా తెలుస్తోంది. ఇది వరకే కేసీఆర్ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. పనితీరును బట్టి మంత్రులను తొలగించడం కూడా జరుగుతుందని ఆయన స్పష్టం చేశాడు. ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రుల విషయంలో కేసీఆర్ మాటతీరు ను బట్టి ఆయన ఏదో సంచలనమే నమోదు చేస్తాడనే అభిప్రాయాలకు కారణం అయ్యింది. కేసీఆర్ తన మంత్రివర్గంలోని ఇద్దరు ఉప ముఖ్యమంత్రుల్లో ఎవరో ఒకరికి ఎర్త్ పెట్టవచ్చనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. మరి ఇద్దరు డిప్యూటీ సీఎంలో బాధితులు ఎవరనేది ఆసక్తికంగా మారిందిప్పుడు. అలాగే కేసీఆర్ ఇప్పుడు తన క్యాబినెట్ లోకి ఎవరిని తీసుకొంటాడనేది కూడా ఆసక్తికరమైన పరిణామమే. తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తాడా?! లేక ఆది నుంచి టీఆర్ఎస్ లో ఉండి కష్టపడిన వారికి ప్రాధాన్యం ఇస్తాడా?! అనేది చర్చనీయాంశం అయ్యింది. తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన వాళ్లలో కొంతమంది ముందస్తు హామీతోనే వచ్చినట్టు తెలుస్తోంది. వారికి ఇప్పుడు మంత్రి పదవులు ఖాయమని సమాచారం. ఇక పార్టీలోని నేతలు కూడా చాలా మంది ఇప్పుడు మంత్రి పదవుల మీద ఆశతో ఉన్నారు. మరి వారిలో ఎవరి ఆశలు ఫలిస్తాయో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: