శాసనసభ్యుల ఎన్నికల సమరంలో భారతీయ జనతాపార్టీ అగ్రగామిగా ఉండడం పదిహేనవ తేదీ నాటి పోలింగ్‌కు నేపథ్యం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని నాలుగున్నర నెలల ప్రభుత్వం విజయాల ప్రాతిపదికగా ఈ రెండు రాష్ట్రాల వోటర్లు తీర్పు చెప్పనునానరన్నది ఈ అగ్రగామితత్వానికి ప్రాతిపదిక. భాజపా రెండు రాష్ట్రాలలోను అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందన్నది ప్రత్యర్థి రాజకీయ పక్షాల సమర్ధకులైన విశే్లషకులు సైతం అంగీకరిస్తున్న మహావిషయం. అయితే మహారాష్టల్రో కాని హర్యానాలో కాని భాజపాకు శాసనసభలో పూర్తి మెజారిటీ వస్తుందా? అన్నది దేశవ్యాప్తంగా ప్రజలను ఉత్కంఠకు గురి చేస్తున్న ప్రశ్న. ఏప్రిల్ నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఇరవై ఆరుచోట్ల పోటీ చేసిన భాజపా 23 స్థానాలు గెలిచి ప్రత్యర్థులను విస్మయ చకితులను చేసింది. మహారాష్టల్రోని మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య 48. ఇదే తీరు పునరావృత్తం అవుతుందన్నది జరుగుతున్న ప్రచారం. పురావృత్తం కాకుండా నిరోధించగల పరిణామాలు ఈ నాలుగైదు నెలల్లో సంభవించకపోవడం భాజపా వారి విజయ విశ్వాసానికి కారణం. అయితే లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకు అండగా నిలిచిన శివసేన ఇప్పుడు ఆ పార్టీతో విభేదిస్తోంది. లోక్‌సభ ఎన్నికలలో శివసేన 18 స్థానాలు గెలిచింది. లోక్‌సభ ఎన్నికలలో 41 స్థానాలు గెలిచిన భాజపా-శివసేన కూటమి ఇప్పుడు కూడా ఉమ్మడిగా పోటీ చేసి ఉండినట్టయితే ఈ కూటమికి శాసనసభలో మూడింట రెండు వంతుల మెజారిటీ వచ్చి ఉండేది. అలా జరుగకపోవడానికి ఉభయ పార్టీలు ముఖ్యమంత్రి పదవికి పోటీపడడం ప్రధాన కారణం. విడివిడిగా భాజపా, శివసేన పోటీ చేస్తుండడం వల్ల ఉభయ పార్టీలకూ నష్టం కలుగుతోంది. పాతికేళ్లకు పైగా కలిసి ఉన్న పార్టీలు ఇలా కలహించడం నిజానికి జనం ఊహకందని విపరిణామం. హిందుత్వ సిద్ధాంత విషయంలో భాజపాతో సంపూర్ణ భావస్వామ్యం కలిగి ఉన్న శివసేన అంత్యంత విశ్వసనీయమైన మిత్రపక్షం. 1991నుండీ భాజపాతో జట్టు కట్టిన ఇతరేతర పక్షాలు అనేకసార్లు విభేదించి విడిపోయాయి. శివసేన అలా కాక గత నెలవరకూ భాజపా వెంట నడవడానకి కారణం హిందూత్వ సిద్ధాంత సామ్యం. ఇలా సైద్ధాంతిక సమానత్వం కలిగిన రెండు పార్టీలు కలహించి విడిపోవడానికి కారణం అనుకూల వాతావరణం ఉన్న సమయలో ఆధిపత్యాన్ని పెంచుకోవాలని ప్రాబల్యాన్ని విస్తరించుకోవాలని ఉభయ పక్షాలు భావించడం. ఈ కలహం వల్ల భాజపా కంటె శివసేనకు ఎక్కువ నష్టం వాటిల్లడం ఖాయమన్నది స్పష్టమైపోయిన పరిణామం. ఎందుకంటె భాజపాకు నరేంద్ర మోదీ వలె శివసేనకు దీటైన నాయకుడు లేడు. శివసేననుండి విడిపోయి మహారాష్ట్ర నవనిర్మాణ సేనను స్థాపించిన రాజ్‌థాకరే వల్ల కూడ శివసేన వోట్లకు భారీగా గండిపడుతోంది. పదేళ్లకు పైగా అధికారం చెలాయించిన కాంగ్రెస్-జాతీయ కాంగ్రెస్ పార్టీల కూటమి కూడ విచ్ఛిన్నమై పోవడం భాజపాకు కలిసొచ్చిన మరో అవకాశం. భాజపా-శివసేన కూటమి విచ్ఛిన్నమైన నేపథ్యంలో కాంగ్రెస్‌ల కూటమి కలిసికట్టుగా ఉంది. పోటీ చేసినట్టయితే పరిణామాలు, ఫలితాలు మరోవిధంగా ఉండేవేమో? హర్యానా శాసనసభలో 90 స్థానాలుండగా లోక్‌సభ ఎన్నికలలో భాజపాకు 52 చోట్ల మిగిలిన పార్టీలకంటె ఎక్కువ వోట్లు లభించాయి. చరిత్రలో మొదటిసారి హర్యానాలో తనంత తానుగా అధికారం హస్తగతం చేసుకోగల అవకాశాల గురించి జరుగుతున్న ప్రచారానికి ఇదీ ప్రాతిపదిక. 2009 నాటి లోక్‌సభ ఎన్నికలలో కేవలం 9శాతం ఓట్లను సాధించిన భాజపాకు 2014 నాటి లోక్‌సభ ఎన్నికలలో 35శాతం లభించాయి. హర్యానాలో భాజపా సాధించిన అత్యద్భుత ప్రగతికి ఇది నిదర్శనం. హర్యానాలోని పది లోక్‌సభ స్థానాలలో ఏడు చోట్ల భాజపా విజయం సాధించింది. 2009లో 35శాతం వోట్లు సాధించిన కాంగ్రెస్ ఇటీవలి లోక్‌సభ ఎన్నికలలో 23శాతం మాత్రమే గెలుచుకొని మూడవ స్థానానికి దిగజారింది. ఓం ప్రకాశ్ చౌతాలా నాయకత్వంలోని ఇండియన్ నేషనల్ లోక్‌దళ్-ఐఎన్‌ఎల్‌డి-లోక్‌సభ ఎన్నికలలోవలెనే ఈ శాసనసభ ఎన్నికలలో సైతం భాజపాకు ప్రధాన ప్రత్యర్థిగా అవతరించడం ప్రధానమైన పరిణామం. హర్యానాలో అంతరించిపోతున్న కాంగ్రెస్ పలుకుబడికి ఇది నిదర్శనం. 2009 నాటి లోక్‌సభ ఎన్నికల సమయంలో 40 శాసనసభ స్థానాలలో ఆధిక్యతను సాధించిన కాంగ్రెస్‌పార్టీ ఈ లోక్‌సభ ఎన్నికలలో 15 శాసనసభ స్థానాలలో మాత్రం అగ్రగామి కావడం పార్టీ పతన దిశా ప్రగతికి చిహ్నం. లోక్‌సభ ఎన్నికల సమయంలో మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ కుమారుడు కులదీప్ విష్ణు నాయకత్వంలోని హర్యాన జనహిత కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న భాజపా శాసనసభ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తుండడం ఆ పార్టీలో పెరిగిన విజయ విశ్వాసానికి చిహ్నం. మహారాష్టల్రోని శివసేన వలె హర్యానాలో జనహిత కాంగ్రెస్ సైతం భాజపాతో తెగతెంపులు చేసుకోవడానికి కారణం సీట్ల బేరం కుదరకపోవడమే. ఎదుగుతున్న కొద్దీ, ప్రజాదరణ పెరుగుతోందన్న విశ్వాసం వికసిస్తున్న కొద్దీ మీత్రులతో తెగతెంపులు చేసుకోవడం భాజపా అనుసరిస్తున్న దశాబ్దుల ఎన్నికల వ్యూహంలో భాగం. అనేక రాష్ట్రాలలో ప్రాధా న్యం లేని అల్పసంఖ్యాక రాజకీయ పక్షంగా ఉన్న సమయంలో ఇతర పెద్ద పార్టీలతో పొత్తు కుదుర్చుకున్న భాజపా ఆ తరువాత ఆయా మిత్ర పక్షాలతో తెగతెంపులు చేసుకుంది. ఎదగడం కోసం మిత్రులతో రాజీపడటం, ఎదిగిన తరువాత జటిల వైఖరి అవలంభించడం ద్వారా తెగతెంపులు చేసుకోవడం గతంలో అనేక రాష్ట్రాలలో భాజపా విజయవంతంగా అమలు జరిపిన వ్యూహం. గుజరాత్‌లో, ఉత్తరప్రదేశ్‌లో, బీహార్‌లో, ఒడిస్సాలో, కర్ణాటకలో, అస్సాంలో భాజపా వారి వ్యూహం విజయవంతమైంది. కాంగ్రెస్‌ను ఢీకొనడానికై ఇతర పక్షాలతో జట్టు కట్టిన భాజపా కాంగ్రెస్ పతనం తరువాత మిత్రులనుండి విడిపోవడం ఈ రాష్ట్రాల రాజకీయ చరిత్ర. ఇప్పుడు మహారాష్టల్రోను, హర్యానాలో భాజపా ఇదే పనికి పూనుకుంది. పాతికేళ్లుగా శివసేనకు శాసనసభ స్థానాలలో అధికశాతం సీట్లు కేటాయించిన భాజపా ఇప్పుడు సమానత్వాన్ని కోరడం, ముఖ్యమంత్రి పదవి కోరడం ఈ వ్యూహంలో భాగం. నరేంద్ర మోదీ నాయకత్వానికి దేశ ప్రజల సమర్ధన భారీగా లభించడంతో మహారాష్టల్రో అనుసరించే స్థాయి నుంచి అగ్రగామి హోదాకు ఎదిగిపోవాలన్నది భాజపా వ్యూహం. అందువల్ల కేవలం పదిసీట్లకోసం శివసేనతో భాజపా తీవ్రంగా విభేదించింది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా చాణక్యనీతి ఫలించింది. భాజపాకు 288 స్థానాలున్న అసెంబ్లీలో110 స్థానాలు దక్కడం ఖాయమని సరికొత్త సర్వే వెల్లడించింది. శివసేనకు 55 స్థానాలు మాత్రం దక్కనున్నాయట. హర్యానాలో సైతం లోక్‌సభ ఎన్నికల ఘనవిజయం తరువాత జనకాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకోవడానికి భాజపా రంగం సిద్ధం చేసింది. సగం సగం సీట్ల సూత్రాన్ని తిరస్కరించి కులదీప విష్ణు తనంత తానుగా కూటమి నుంచి నిష్క్రమించడాని అనివార్య స్థితిని కల్పించింది. దేశంలో రాజకీయ ప్రాబల్య చరిత్ర పునరావృత్తం అవుతోంది. 1977 వరకు కాంగ్రెస్‌కూ ఇతరులకు మధ్య పోరాటం నడిచింది. ఇప్పుడు భాజపాకు ఇతరులకూ మధ్య పోరాటం మొదలైంది...

మరింత సమాచారం తెలుసుకోండి: