బాధితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైపోయిందని విమర్శిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వై.ఎస్‌. జగన్మోహన రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం దిగి వచ్చి బాధితులను పూర్తిగా ఆదుకునే వరకూ పోరాటం చేస్తామన్నారు. ఈ దశలో బాధితులకు తోడై ఉంటానని ఆయన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన పశ్చిమ నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. హుదూద్‌ పెను తుపానులో ఆస్తులను కోల్పోయిన వారికి తక్షణ సహాయం అందాల్సి ఉందన్నారు. తుపాను తరలిపోయి అయిదు రోజులైనా ఇప్పటికీ తాగు నీరు, విద్యుత్తుని అందించలేని స్థితిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందన్నారు. పేరుకు విశాఖలో ఉన్నానని చెబుతున్న చంద్రబాబు విశాఖ నష్టానికి ఏం చేస్తున్నారని నిలదీశారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగడా పోరాటం చేసి, బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించిన జగన్‌ నియోజక వర్గంలోని సాకేతపురం తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయనతో పాటూ వైకాపా జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్‌నాథ్‌ , పశ్చిమ నియోజక వర్గం సమన్వయ కర్త డాక్టర్‌ విజయప్రసాద్‌ మళ్ల, ఇదే పార్టీకి చెందిన కరణం ధర్మశ్రీ, ఇతర నాయకులు జియ్యాని శ్రీధర్‌, దొడ్డి కిరణ్‌, ఆళ్ల పైడిరాజు, తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: