అన్నాడీఎంకే అధినేత్రి జైలు పాలు అయ్యిందని.. ఇక తమ రాష్ట్రంలో అన్నాడీఎంకేను అంతం చేయడం పెద్ద కష్టమేం కాదని.. తమ కష్టాలన్నీ కడతేరిపోయినట్టేనని... ఎలాగోలా కోలుకోవడానికి అవకాశం ఏర్పడిందని ఫీలయిన తమిళ పార్టీలకు ఆ ఆనందం ఆవిరి అయ్యింది. అమ్మకు బెయిల్ రావడంతో వాళ్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్టు అవుతోంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జయలలిత మళ్లీ తమ భరతం పడుతుందని వారిలో భయం మొదలైంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు పాలై ముఖ్యమంత్రి పదవిని కూడా కోల్పోవడంతో డీఎంకే తో సహా అన్ని తమిళ పార్టీలూ ఆనందించాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో అమ్మ ఈ విధంగాజైలుకువెళ్లడం మంచిదని.. అసలే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిని ఉన్న తమకు ఇది ఊరటనిచ్చే పరిణామం అవుతుందని వారు అనుకొన్నారు. అయితే ఇప్పుడు అమ్మ దాదాపుగా బయటకు వచ్చేసినట్టే..! జయలలిత ఈ సారి పక్కా ప్లాన్ రెడీ చేసుకొంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ గెలవడానికి తగిన బేస్ ను ఏర్పాటు చేస్తుంది. సంక్షేమ పథకాలను మరింత పదునెక్కిస్తుంది. ముఖ్యమంత్రి పీఠంలో తన అనుచరులను కూర్చొబెట్టి జయలలిత గేమ్ ఆడే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో ప్రతిపక్షాల పీచం అణచడానికి కూడా జయలలిత వెనుకాడకపోవచ్చు. అంతా బాగున్నప్పుడే జయలలిత ప్రతిపక్ష పార్టీలను ముప్పు తిప్పలు పెట్టింది. మరి ఆమె ఇప్పుడు ఇబ్బందుల్లో ఉంది. కాబట్టి ప్రతిపక్షాలపై తన పంజా విసిరే అవకాశం ఉంది. అందరినీ కంట్రోల్ చేసే విధంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ విధంగా జయ విడుదల అనే పరిణామం తమిళనాడు ప్రతిపక్ష పార్టీలకు కష్టకాలం తెచ్చేపెట్టేదిలా మారింది!

మరింత సమాచారం తెలుసుకోండి: