స్టార్ హీరోల పట్ల అభిమానం ఉండటం సర్వ సాధారణ విషయం అయితే ఈ అభిమానం దురభిమానంగా మారి మంచి ప్రయత్నం చేస్తున్న మిగతా హీరోల పనుల ఫై కావాలని సెటైర్లు వేసేలా కామెంట్లు వెబ్ మీడియాలో పోస్టు చేయడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  ఇక ఈ విషయం పై వివరాలలోకి వెళితే నిన్న పవన్ ఖమ్మంలో మృత్యువుతో పోరాడుతున్న శ్రీజను చూసి ఆమె పరిస్థితికి చలించి పోయి 2 లక్షల ఆర్ధిక సహాయం కూడా చేసాడు ఈ సంఘటన అందరి హృదయాలను హత్తుకునేల చేసింది.  అందరికీ ఎంతో స్పూర్తిని ఇచ్చిన పవన్ చేసిన సహాయం పవన్ వీరాభిమానులకు విపరీతంగా నచ్చి పవన్ ను పొగడ్తలతో ముంచెత్తి వేస్తూ పవన్ స్థాయిని అందుకునే హీరో ప్రస్తుతం ఎవరూ లేరని కామెంట్ చేస్తూ పవన్ ను దేవుడితో సమానంగా పోలుస్తూ వెబ్ మీడియాలో కామెంట్లు పెడుతూ పవన్ వీరాభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.  అయితే ఈ కామెంట్స్ ను చూసిన జినియర్, మహేష్ ల అభిమానులు ఈ విషయంలో పవన్ అభిమానులు చేపుతున్నంత గొప్ప తనం లేదని ఇటువంటి సహాయాలు, ఆపదలో ఉన్న అభిమానులను ఓదార్చిన సందర్భాలు మహేష్, జూనియర్లు కూడా గతంలో చాల చేసారు అంటూ వెబ్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ కామెంట్లకు పవన్ అభిమానులు కూడా గట్టిగానే ప్రతిస్పందిస్తున్నారు.  మంచి పనిని ఆదర్శంగా తీసుకోకుండా ఇలా స్టార్ హీరోల అభిమానులందరూ ఇలా ఒకరి పై ఒకరు బురద జల్లుకోవడం చూస్తూ ఉంటే నేటి సమాజం ఎటు వెళ్ళిపోతోంది అన్న సందేహం ఎవరికైనా కలుగుతుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: