కోలీవుడ్ టాప్ హీరో అజిత్ పై విలక్షణ కామెంట్స్ చేసింది చెన్నై బ్యూటీ త్రిష. ఈమధ్య ఒక కోలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ అజిత్ పేరు చెపితే తాను ఒళ్ళు తెలియకుండా గంటలు గంటలు మాట్లాడుతానని కామెంట్ చేసింది త్రిష. అంతేకాదు స్త్రీలను గౌరవించే విషయంలో అజిత్ కు ఉన్న సంస్కారం మరే హీరోకి లేదని అంటూ త్రిష అజిత్ ను ఆకాశానికి ఎత్తేసింది. ప్రస్తుతం అజిత్ తో ‘తల 55’ సినిమాలో నటిస్తున్న త్రిష సెట్ లో అజిత్ వ్యవహరించే తీరు గురించి మాట్లాడుతూ సెట్లోకి వచ్చిన వెంటనే అజిత్ సెట్ అంతా ఏకాగ్రతగా చూసి లైట్ బాయ్ దగ్గర నుంచి దర్శకుడి వరకు అందరితో నవ్వుతూ పలకరించి చాల స్నేహంగా ఉంటాడని అజిత్ భజన అందుకుంది త్రిష.  అయితే కోలీవుడ్ లో ప్రస్తుతం ఈమె వంక అజిత్ తప్ప మరి ఏ టాప్ హీరో చూస్తూ ఉండకపోవడంతో అజిత్ ను మరింత కాకా పట్టడానికి త్రిష ఈ భజన చేస్తోందా? లేదంటే ఈ పొగడ్తలలో ఏదైనా మాస్టర్ ప్లాన్ ఉందా అంటూ కోలీవుడ్ మీడియా త్రిష పై లేటెస్ట్ గా వార్తలు రాస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: