విశాఖ నగరంలోనూ, జిల్లాలోనూ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. బాధితులకు భరోసా కల్పించారు. తుమ్మపాలలో చెరకు రైతులు వైఎస్ జగన్ను కలిసి తమ గోడు వెల్లడించుకున్నారు. చెరకు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని జగన్కు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ప్రభుత్వం షుగర్- ఫ్యాక్టరీని ప్రైవేట్- వ్యక్తులకు అప్పగించాలని చూస్తోంది, గతంలో రూ.4కోట్లకు విక్రయించేందుకు చూస్తే వైఎస్- అడ్డుకున్నారని వివరించారు. చంద్రబాబు ప్రభుత్వం తీరును జగన్- మోహన్- రెడ్డి ఖండించారు. రైతుల ఆగ్రహాన్ని చంద్రబాబు చవిచూసేరోజు దగ్గర్లోనే ఉందని జగన్- అన్నారు. , సహకార రంగంలోని ఫ్యాక్టరీలన్నింటినీ నష్టాల్లోకి తోసి సొంత మనుషులకు ఇచ్చేందుకు బాబు యత్నిస్తున్నారని ఆరోపించారు. హుదూద్ తుఫాను బారిన పడిన విశాఖపట్నంలోని తుమ్మపాల ప్రాంతాన్ని ఆయన శనివారం సందర్శించి, అక్కడి వారిని పరామర్శించారు. తుఫాను సాయం ఎలా అందుతోందో వారిని అడిగి తెలుసుకున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: