నల్లధనం వ్యవహారంలో మోడీ సర్కార్ తీరుపై విమర్శలు చెలరేగుతున్నాయి. నల్ల ధనికుల జాబితాను బయట పెట్టడానికి మోడీ ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో అన్ని వైపుల నుంచి దాడి అధికం అవుతోంది. ఎన్నికల ముందు మోడీ అండ్ కంపెనీ ఈ వ్యవహారం గురించి బాగా హడావుడి చేసింది. దీంతో ఇప్పుడు అందరికీ నల్లధనం అంశం అస్త్రం అవుతోంది. మోడీ ప్రభుత్వ తీరును దుయ్యబట్టాడుకాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. ఎన్నికల ముందు నల్లధనాన్ని భారత్ కు రప్పిస్తాము అని హామీ ఇచ్చిన మోడీ, భారతీయ జనతా పార్టీ వాళ్లు ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆయన ధ్వజమెత్తాడు. విదేశాల్లో దాగున్న నల్లధనాన్ని వెలికి తీస్తామని.. ప్రతి భారతీయుడికీ మూడు కోట్లరూపాయలుగా ఆ మొత్తాన్ని పంచుతామని వెనుకటికి బీజేపీ వాళ్లు హామీ ఇచ్చారని దిగ్విజయ్ గుర్తు చేస్తున్నాడు! మరి ఇప్పుడు ఆ మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని దిగ్విజయ్ సింగ్ అడుగుతున్నాడు. అలాగే ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా మోడీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. నల్లధనం విషయంలో బీజేపీ వాళ్లు యూటర్న్ తీసుకొన్నారని తృణమూల్ కాంగ్రెస్ అభిప్రాయపడింది. అలాగే బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా బీజేపీ సర్కార్ పై విమర్శలు చేశారు. మోడీలో మునుపటి దూకుడు లేదని ఆయన తేల్చేశాడు. ఈ విధంగా నల్లధనం అంశం గురించి ప్రస్తావిస్తూ అందరూ మోడీ ప్రభుత్వంపై విమర్శల వాన కురిపించారు. అయితే బీజేపీ మాత్రం ఈ విషయంలో ఆచితూచి స్పందిస్తోంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: