సాధారణంగా రాజకీయ నేతల గురించి అనేక ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. ఏవైనా ఆరోపణలతో జైళ్లకు వెళ్లిన నేతలు బెయిల్ మీద బయటకు వచ్చినా వారు లంచం ఇచ్చి బయటకు వచ్చారనే ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. చట్టం, న్యాయస్థానాలతో ముడిపడిన అంశాలే అయినా ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉంటాయి. మరి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కు బెయిల్ దక్కడంపై ఇలాంటి ఆరోపణలను ఎవరూ చేయలేదు కానీ...డబ్బు అయితే ఇక్కడ చర్చనీయాంశమే! జయలలిత డబ్బు చెల్లించిన తర్వాతే ఆమెకు బెయిలు లభించింది. ఏకంగా కోటి రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాతే ఆమెకు బెయిల్ దక్కింది. అక్రమాస్తుల కేసులో దోషిగా నిరూపణ అయిన తర్వాత జయలలితకు బెయిల్ దక్కింది. ఆమె విడుదలయ్యారు కూడా. కోర్టు తీర్పు ప్రకారం జయలలిత కోటి రపాయలు పూచికత్తు చెల్లించాల్సి వచ్చింది. ఆ సొమ్ము జమ చేసిన తర్వాత ఆమెకు అధికారికంగా బెయిల్ వచ్చింది. బయటకు రావడానికి మార్గం ఏర్పడింది. మరి అక్రమాస్తుల కేసులో దోషి అయినందున జయకు వంద కోట్ల రూపాయల జరిమానా పడిన సంగతి కూడా తెలిసిందే. దీంతో ఈ కేసు స్థాయికి తగ్గట్టుగా పూచి కత్తు కూడా కోటి రూపాయలు...! దేశ చరిత్రలో బెయిల్ కోసం ఇంత స్థాయి మొత్తాన్ని డిపాజిట్ చేసిన కేసు కూడా ఇదేనని న్యాయనిపుణులు వ్యాఖ్యానించడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: