హుదూద్ బాధితుల సహాయార్థం విరాళాలు ఇవ్వడంలో సినిమా వాళ్లు తమ సత్తాను చాటారు. రంగుల ప్రపంచానికి చెందిన వాళ్లలో ఒక్కోరూ లక్షల రూపాయలు డొనేట్ చేసి తమ దాతృత్వాన్ని చాటారు. వారు మాత్రమే గాక కొంతమంది పారిశ్రామిక వేత్తలు కూడా తుపాను బాధితుల సహాయార్థం డబ్బును సాయంగా ఇచ్చారు. వీరందరూ ముఖ్యమంత్రి సహాయనిధికి డబ్బును ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే ఉద్యోగులు కూడా డొనేషన్లు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల నుంచి తీసి వంద కోట్ల రూపాయలపై మొత్తాన్ని డొనేట్ చేశారు. మరి ఇలా సమాజంలోని వివిధ వర్గాల వారు ఈ విధంగా స్పందిస్తుంటే... రాజకీయ నేతలు మాత్రం స్పందించింది లేదు. రాజకీయ నేతలు ఎవరూ తుపాను బాధితుల కోసం వ్యక్తిగతంగా డొనేషన్లు ఇస్తున్నది లేదు. అయితే కొంతలో కొంత వైఎస్సార్ కాంగ్రెస్ వాళ్లే ఈ వ్యవహారంలో స్పందిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి హుదూద్ బాధితుల సహాయార్థం 50 లక్షల రూపాయలు డొనేట్ చేశారు. వైఎస్సార్ ఫౌండేషన్ తరపున సహాయకార్యక్రమాలు చేపట్టడానికి జగన్ ఈ మొత్తాన్ని కేటాయించాడు. ఎవరు చేసినా సహాయం అనేది మంచిదే కాబట్టి వైసీపీ అధినేతను అభినందించవచ్చు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో డొనేషన్ ఇచ్చిన రాజకీయ నేత కూడా వైసీపీ వ్యక్తే.

మరింత సమాచారం తెలుసుకోండి: