హంగ్ దిశగా దూసుకుపోతున్న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల్లో 25 ఏళ్ల అనుబంధానికి తెరదింపి... ఎవరికి వారే పోటీ చేసిన బీజేపీ, శివసేనలు మళ్లీ ఒకటయ్యే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఎంతయినా మనంమనం ఒకటే అనుకుంటున్నారు ఇరు పార్టీల నేతలు. ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఈ రెండు పార్టీల మధ్య చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో, చెరో రెండున్నర ఏళ్లపాటు సీఎం పదవిని చేపడదామని బీజేపీకి శివసేన ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ పై సాయంత్రం జరగనున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆ పార్టీ నేతలు చర్చించనున్నారు. శివసేన తమ మిత్రపక్షమని... కాంగ్రెస్, ఎన్సీపీలే తమ ప్రత్యర్థులని ఇప్పటికే మహారాష్ట్ర బీజేపీ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: