గత సంవత్సరం పవన్ ‘అత్తారింటికి దారేది’ పైరసీ బారిన పడటంతో ఆ గుణపాఠంతో టాలీవుడ్ లో భారీ సినిమాలు తీస్తున్న దర్శక నిర్మాతలు చాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో రాజమౌళి ముందు వరసలో ఉండటమే కాకుండా షూటింగ్ స్పాట్ లో సెల్ ఫాన్స్ నిషేధం అంటూ పెద్దపెద్ద బోర్డులు పెట్టి మరీ హడావిడి చేసాడు.  అయినా లీక్ ల బెడద రాజమౌళి ‘బాహుబలిని’ ఎదో విధంగా వేటాడుతూనే ఉంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కొన్ని రోజుల క్రితం వెబ్ మీడియాలో హడావిడి చేసిన ప్రభాస్ ‘బాహుబలి’ ఫస్ట్ లుక్. నిజానికి రాజమౌళి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను, ప్రభాస్ పుట్టినరోజు అయిన అక్టోబర్ 23న విడుదల చేద్దాం అనుకున్నాడట.  అయితే తన ఆలోచన ఇంకా కార్య రూపం దాల్చకుండానే ప్రభాస్ ‘బాహుబలి’ సంబంధించిన స్టిల్ తనకు తెలియకుండానే వెబ్ మీడియాలోకి ఎలా వచ్చిందో అర్ధం కాక తన యూనిట్ సభ్యుల పై తీవ్ర అసహనాన్ని వ్యక్త పరిచాడట రాజమౌళి. ఇక ప్రభాస్ ‘బాహుబలి’ కి సంబంధించిన ఫోటో ఎలాగు లీక్ అయింది కాబట్టి ఇక ఏమి చేసేది లేక రాజమౌళి అధికారికంగా ఈ ఫోటోను మీడియా సంస్థలకు పంపించాడు అని టాక్. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో ప్రభాస్ పుట్టినరోజునాడు మరో ‘బాహుబలి’ వర్కింగ్ టీజర్ విడుదల చేసే పనిలో రాజమౌళి బిజీగా ఉన్నాడని టాక్...  

మరింత సమాచారం తెలుసుకోండి: