ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణమాపీ గా చెల్లించవలసిన మొత్తాన్ని గణనీయంగా తగ్గించుకున్నట్లు కధనాలు వచ్చాయి.తాజాగా ఎపి విధించిన వివిధ షరతుల ప్రకారం ఎనభైఐదు శాతం మంది రైతులు రుణమాఫీకి అర్హులు కాబోరని ఒక ఆంగ్ల పత్రిక ఆసక్తికరమైన కధనాన్ని ఇచ్చింది.వివిధ ప్రక్రియలను అమలు చేయడం ద్వారా రుణమాఫీ భారాన్ని గణనీయంగా తగ్గించుకుందని చెబుతున్నారు.మొదట మొత్తం రైతులందరికి రుణమాఫీ వర్తింప చేయడానికి ఎనభైఏడు వేల కోట్ల రూపాయల మొత్తం అవసరం అవుతుందని అంచనా వేశారు. ఆ తర్వాత దానిని లక్షన్నరకు పరిమితం చేయడం ద్వారా నలభై ఐదు వేల కోట్లకు తీసుకువచ్చారు.  ఆ తర్వాత రైతుల ఎంపిక లేదా తనిఖీ ప్రక్రియ ఆరంభించారు.ఇందుకు మూడు పద్దతులు పాటించారు.ఆధార్ కార్డు ద్వారా పరిశీలన,తదుపరి రేషన్ కార్డు ద్వారా కుటుంబ వివరాల పరిశీలన,అనంతరం భూముల సర్వే నెంబర్లను టాలీ చేసుకోవడం జరిగింది.ఈ విదానాలన్నిటిని అమలు చేస్తే మొత్తం పదిహేను లక్షల రైతుల ఖాతాలే అర్హమైనవిగా గుర్తించారని అంటున్నారు. దీని ప్రకారం ఇప్పుడు ఇరవై వేల కోట్ల రూపాయలు మాఫీకి సరిపోతుందని అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు.కోటి ఖాతాలను పదిహేను లక్షలకు తగ్గించడంలో నేర్పరితనంగా చేశారని విశ్లేషిస్తున్నారు. ఈ తాజా లెక్కలన్ని నిజమే అయ్యే పక్షంలో రుణ మాపీ రాని రైతులు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: