వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుపై మంగళవారం సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. విజయసాయి రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి నిమ్మగడ్డ ప్రసాద్ ఆయోధ్య రామిరెడ్డి, పెన్నా ప్రతాప్ రెడ్డి, సజ్జల దివాకర్ రెడ్డి పునీత్ దాల్మియా ఐఎస్ఎస్‌లు శాంబాబు శామ్యూల్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. విచారణను సీబీఐ కోర్డు ఈ కేసు నవంబర్ 20వ తారీఖుకి వాయిదా వేసింది. హుధుద్ తుపాను బాధితుల పరామర్శ నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి వైయస్ జగన్‌కు మినహాయింపు పొందారు. వైయస్ జగన్ హుధుద్ తుఫాన్ బాధితులను పరామర్శిస్తూ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఐతో ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని అరసవెళ్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకోనున్నారు. ఉత్తరాంధ్రలో హుధుద్ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో గత 8 రోజుల నుంచి విస్తృతంగా పర్యటిస్తున్నారు. సోమవారం విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని బాధితులను ఆయన పరామర్శించారు. ఈ కేసులో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారి కృపానందం, రాజగోపాల్ విచారణకు హాజరయ్యారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: