మరి ఐసీసీ చైర్మన్ అంటే చాలా బిజీగా ఉంటాడని అనుకొంటాం కానీ.. శ్రీనివాసన్ మాత్రంచాలా ఖాళీగానే ఉన్నట్టున్నాడు. జగన్ కేసులో నిందితుడిగా ఆయన తరచూ కోర్టు ముందుకు వస్తున్నాడు. విచారణను ఎదుర్కొంటున్నాడు. మరి ఐసీసీ చైర్మన్ కీ, జగన్ కేసుకీ ఏం సంబంధం అంటే... ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా ఉన్న శ్రీనివాసన్ ఇండియా సిమెంట్స్ అధినేత కూడా. ఇండియా సిమెంట్స్ కూడా జగన్ ఆస్తుల కేసులో విచారణను ఎదుర్కొంటోంది. క్విడ్ ప్రో కో కింద ఆ కంపెనీ పెట్టుబడులు పెట్టిందనేది ఆరోపణ. మరి వేరే రాష్ట్రానికి చెందిన ఆ కంపెనీ వాళ్లను జగన్ బెదిరించాడని.. అందుకే వాళ్లు పెట్టుబడులు పెట్టారని సీబీఐ ఆరోపిస్తోంది. అయితే తమను ఎవరూ బెదరించలేదని... క్విడ్ ప్రో కోకి కూడా పాల్పడలేదని.. తాము పెట్టుబడులు పెట్టాలనిపించి మాత్రమే పెట్టామని శ్రీనివాసన్ స్పష్టం చేస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయి క్రికెట్ వ్యవహారాలతో తన మునకలై ఉండి కూడా శ్రీనివాసన్ కోర్టుకు వచ్చి ఇదే విషయాన్ని చెబుతుండటం విశేషం. తాజాగా మరోసారి ఆయన సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యాడు. ఈ విచారణకు ఆయనతో పాటు... పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, పెన్నా ప్రతాపరెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డి, మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి సహా ఇతర నిందితులు మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. వీరి హాజరును నమోదు చేసుకున్న న్యాయమూర్తి ఎన్.బాలయోగి తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేశారు. మొత్తానికి జగన్ కేసు ఇలా నడుస్తోంది!

మరింత సమాచారం తెలుసుకోండి: