టీఆర్ఎస్ నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వెల్లువెత్తుతున్నా.. అది ఇప్పట్లో లేనట్టేనని సంకేతాలు వెలువడుతున్నాయి. కొత్తగా టీఆర్ఎస్ పార్టీలో చేరిన నేతలతో పాటు... మొదటి నుంచి పార్టీలు ఉన్నవారు కూడా విస్తరణపై కొండంత ఆశ పెట్టుకున్నారు. విస్తరణ ముహూర్తం.. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూవస్తుండటంతో వారిలో నిరాశ మొదలైంది. నిన్నమొన్నటివరకూ దీపావళి తర్వాత విస్తరణ కచ్చితంగా ఉంటుందని చెప్పుకున్నా.. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే..అలాంటి సూచనలేమీ కనిపించడం లేదు. అసెంబ్లీ సమావేశాల తర్వాతే కేబినెట్ విస్తరణ జరపాలని తాజాగా కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గాన్ని విస్తరించాలని కేసీఆర్ భావించినా.. ఆశావహుల జాబితాకు ఉన్న మంత్రివర్గ స్థానాలకు పొంతన కుదరకపోవడమే వాయిదాకు నిర్ణయమని తెలుస్తోంది. ఓవైపు అసెంబ్లీ సమావేశాల సమయం ముంచుకొస్తుండటంతో..ఇప్పుడీ కొత్త కొలువుల జాతర పెట్టుకుంటే.. దానిపై ప్రభావం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారట. ఇటు పార్టీ అటు ప్రభుత్వం సవ్యంగా సాగించాలనే వుద్దేశ్యంతోనే విస్తరణ వాయిదా నిర్ణయం తీసుకున్నారట. పార్టీ ప్లీనరీ తర్వాత పార్టీతో పాటు ప్రభుత్వంలో కీలకమైన మార్పులు తీసుకోవాలని రావాలని భావించిన సీఎంకు పరిస్ధి తులు అనుకూలించలేదు. ప్లీనరీ వాయిదా పడటంతో ... సీఎం నేరుగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై దృష్టి పెట్టారు. మంత్రి వర్గవిస్తరణతో పాటు పార్టీ ప్లీనరీ సమావేశాలను ఒక దాని తర్వాత ఒకటి నిర్వహించే అంశంపై కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. దీనివల్ల పార్టీ నేత లతో పాటు కార్యకర్తల్లోనూ కొంత ఉత్సాహం పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ లోపుగా ప్రభుత్వం నామినేటేడ్‌ పదవులను పంపకాన్ని పూర్తిచేస్తే మంత్రివర్గాన్ని విస్తరిస్తరించడం శ్రేయస్కరమని కేసీఆర్‌తో పాటు పార్టీ ముఖ్యులు ఆలోచిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కేసీఆర్‌ పలువురు రాజకీయ విశ్లేషకులను సంప్రదించినట్లు తెలుస్తోంది. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే.. మంత్రివర్గ విస్తరణకు తాత్కాలికంగా బ్రేక్‌ వేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: