మహారాష్ట్ర్జ ముఖ్యమంత్రిగా బిజెపి అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరు దాదాపు ఖరారైనట్లు బిజెపి అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంతకు ముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో వినోద్‌ తావ్‌డే, ఏక్‌నాథ్‌ ఖడ్‌సె, పంకజ్‌ ముండె, నితిన్‌ గడ్కరీ పేర్లు వినిపించాయి. అయితే అధికార వర్గాల నుండి వెల్లడైన సమాచారం మేరకు వివాదాస్పదుడు కాని 44 సంవత్సరాల దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరు సిఎం పదవికికి ఖరారైపోయింది. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి. కాగా మొదటి నుండి ఫడ్నవీస్‌ పేరు ముఖ్యమంత్రి రేసులో ముందుగా వినిపిస్తూ వచ్చింది. గడ్కరీ కూడా స్వయంగా ఇదే విషయాన్ని ప్రకటించారు. పైగా తాను ఢిల్లీలో ఆనందంగానే పనిచేసుకుంటున్నానన్నారు. అలాగే తనకు మహారాష్ట్ర వెళ్లే ఉద్దేశం లేదన్నారు. అయితే మహారాష్ట్ర బిజెపి మాజీ అధ్యక్షుడు సుధీర్‌ ముంగ్టీవర్‌ డిమాండ్‌తో గడ్కరీ పేరు సిఎం రేసులో మరోమారు వినిపించింది. ముంగ్టీవర్‌ కూడా ముఖ్యమంత్రి పదవికి గƒడ్కరీకి మద్దతు పలికారు. అలాగే విదర్భకు చెందిన 44 మంది బిజెపి ఎమ్మెల్యేలలో 39 మంది కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరిని ముఖ్యమంత్రిగా ఎం పిక చేయాలని డిమాండ్‌ చేశారు. వారంతా మంగళవారం గడ్కరీ ఇంటికి చేరుకుని ముఖ్యమంత్రిగా వ్యవహరించేం దుకు ఒప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే బిజెపిలో కీలక పాత్ర పోషిస్తున్న గడ్కరి వారికి నచ్చజెప్పి పంపించేశారు. ఈ నేపధ్యంలో పార్టీ ఫడ్నవీస్‌ పేరును దాదాపు ఖరారు చేసింది. కాగా మహారాష్టల్రో బిజెపి, దాని మిత్రపార్టీ కలిసి 123 సీట్లు గెలుచుకున్నాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బిజెపికి ఇంకా 25 సీట్ల అవసరం ఉంది. ఇందుకోసం ఎన్‌సిపి(41 సీట్లు సాధించింది) ఎటువంటి షరతులు లేకుండా మద్దతు పలికేందుకు సిద్ధమైపోయింది. అయితే బిజెపి పాత నేస్తం శివసేన కూడా ఇప్పుడు మైత్రికోసం తపించిపోతున్నట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: