ఒకరు ఎడ్డెం అంటే.. మరొకరు తెడ్డెం అని అనాల్సిందే. లేకపోతే అది కాంగ్రెస్ పార్టీ అనిపించుకోదు. అధికారంలో ఉన్నప్పుడు, పరిస్థితులన్నీ బాగున్నప్పుడే కాదు.. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో అదే పంథా కొనసాగుతోంది. తాజాగా ఆళ్లగడ్డ ఉప ఎన్నిక వ్యవహారం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతల నోటి నుంచి డబుల్ టోన్ వినిపిస్తోంది. అసలు కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో పోటీ చేయకపోవడం ఏమిటి? అని ప్రశ్నిస్తున్నాడు కాంగ్రెస్ సీనియర్ నేత డొక్క మాణిక్య వరప్రసాద్. నందిగామలో పోటీ చేసి ఆళ్లగడ్డలో పోటీ చేయకపోవడం ఏమిటి? అంటూ ఆయన కొశ్చన్ చేస్తున్నాడు. నందిగామలోనూ, ఆళ్లగడ్డలోనూ ఒకటే పరిస్థితుల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని... నందిగామలో పోటీ చేయడం ఏమిటి? ఆళ్లగడ్డలో చేయపోవడం ఏమిటి? అంటూ ఆయన నిలదీస్తున్నాడు. ఈ విషయంలో ఆయన దళిత వాదాన్ని కూడా తీసుకొస్తున్నాడు. నందిగామలో దళితులు పోటీ చేశారు కాబట్టి.. అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టింది.. ఆళ్లగడ్డలో రెడ్డి కాబట్టి పోటీ పెట్టలేదు అనే భావనను వ్యక్తం చేస్తున్నాడు ఈ మాజీ మంత్రిగారు. ఈ విషయంలో పీసీసీ తీరును మాణిక్యవరప్రసాద్ తప్పుపడుతున్నాడు. ఈ విధంగా ఆళ్లగడ్డ వ్యవహారంలో కూడా కాంగ్రెస్ లో డబుల్ టోన్ వినిపిస్తోంది. నేతలు ఒకరితో ఒకరు విభేదిస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ల మధ్య సబబు చెప్పేది ఎవరో!

మరింత సమాచారం తెలుసుకోండి: