తెలుగుదేశం అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు అమోఘమైన ముందు చూపు ఉందని చెప్పుకొంటున్నా.. ఆ విషయాన్ని ఒప్పుకోవడం లేదు రాయలసీమ ప్రాంత రైతాంగం. వారు ఈ విషయంలో చంద్రబాబు తీరును తప్పుపడుతున్నారు. బాబుకు ఉన్న ముందు చూపు ఇదేనా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు! శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి వ్యవహారం గురించి స్పందిస్తూ రాయలసీమ ప్రాంత రైతు సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును నిరసిస్తున్నారు. విపరీతంగా విద్యుత్ ను ఉత్పత్తి చేసేస్తున్నాం అంటూ డ్యామ్ లలో నీళ్లు లేకుండా చేస్తున్నారు అంటూ రైతులు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. బాబుకు ముందు చూపే ఉంటే ముందు విద్యుత్ ఉత్పత్తిని ఆపివేయాలని వారు అంటున్నారు. కరెంటు కావాలంటే కొనుక్కోవచ్చని... నీళ్లను కొనుక్కోలేమన్న విషయాన్ని గ్రహించాలని రైతు సంఘం నాయకులు బాబుకు గుర్తుచేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను విడుదల చేస్తూ పోతే... రానున్న కాలంలో రైతుల పరిస్థితి ఏమిటని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీళ్లను విడుదల చేయడం వల్ల రాయలసీమ సాగునీటి, తాగునీటి కి కష్టకాలం వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి ఆలోచించి ఏపీ ముఖ్యమంత్రి విద్యుత్ ఉత్పత్తిని వెంటనే ఆపించేయాలని రైతులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: