వైసీపీకి హైదరాబాద్ లో శాశ్వత కార్యాలయం కోసం జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందు కోసం అవసరమైన స్థలాన్ని సేకరించే బాధ్యతను ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పజెప్పారు. దీపావళి తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసి అన్ని పార్టీలకు కేటాయించినట్లు తమ పార్టీకి కూడా హైదరాబాద్ లో ఉచితంగా స్థలాన్ని కేటాయించాలని కోరతామని శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తే వెంటనే పార్టీ కార్యాలయం నిర్మించేందుకు వైసీపీ సిద్ధమవుతుంది. పార్టీ స్థాపించినప్పటి నుంచి హైదరాబాద్ రోడ్ నెం.45 లోని భవనం వైసీపీ ప్రధాన కార్యాలయంగా ఉండేది. సుమారు కోటి రూపాయల అద్దె ఆ భవనానికి చెల్లించేవారు. అయితే, ఇటీవలే పార్టీ ఖర్చులను తగ్గించుకునేందుకు గాను, ఆ భవనం నుంచి పార్టీ కార్యాలయాన్ని లోటస్ పాండ్ కు షిప్ట్ చేశారు. హైదరాబాద్ తో పాటు విజయవాడలో కూడా పార్టీకి ఓ శాశ్వత కార్యాలయాన్ని నిర్మించాలని జగన్ భావిస్తున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: