''నాథూరాం గాడ్సే గురి మహాత్మాగాంధీ కాదు...జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందుకు కారణం దేశ విభజనకు ఆయనే బాధ్యుడు''.... ఇవి ఆర్‌ఎస్‌ఎస్‌కి చెందిన మళయాళ పత్రిక 'కేసరి'లో ప్రచురితమైన వ్యాసంలోని విష యాలు. ఈ అంశం ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రధానంగా కేరళ రాజకీయ వర్గాల్లో దుమారం రేపింది. కాగా, ఈ వివాదాస్పద వ్యాసాన్ని ఆర్‌ఎస్‌ ఎస్‌ కూడా ఖండించింది. ఈ వ్యాసంపై కేరళలో కాంగ్రెస్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చర్యలకు డిజిపిని ఆదేశించాలంటూ రాష్ట్ర హోంమంత్రిని కూడా కోరింది. ఈ నెల 17వ తేదీన కేసరిలో ప్రచు రితమైన ఈ వ్యాసాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్రంగా ఖండిం చింది. ఇవి రచయిత అభిప్రాయాలు మాత్రమేనని పేర్కొంది. ఆర్‌ఎస్‌ఎస్‌కి ఏమీ సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ జాతీయ ప్రచార్‌ ప్రముఖ్‌ మన్మోహన్‌ వైద్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి తరపున పోటీ చేసిన గోపాలకృష్ణన్‌ ఈ వ్యాసాన్ని రాశారు.  జాతిపిత గాం ధీతో నెహ్రూ ఎప్పుడూ నిజమైన సంబంధాలను కలిగి లేరని కూడా గోపాలకృష్ణన్‌ ఈ వ్యాసంలో రాశారు. ఈ వ్యాసాన్ని వ్యతిరేకిస్తూ వార్తాపత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి హింసనైనా ఆలోచనలోగానీ, ఆచ రణలోగానీ ఆర్‌ఎస్‌ఎస్‌ ఎప్పుడూ వ్యతిరేకిస్తుందని, అందువల్ల గోపాలకృష్ణన్‌ అభిప్రాయాలను అంగీ కరించలేమని వైద్య పేర్కొన్నారు. ఇలాంటి అభిప్రా యాలకు దూరంగా ఉండడం మాత్రమే కాదు దీనిపై విచారం వ్యక్తం చేస్తున్నామని ప్రకటించారు. కాగా, ఈ వ్యాసంపై కేరళలో కాంగ్రెస్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనిపై దృష్టిసారించి అవసరమైతే చర్యలు తీసుకునే విధంగా డిజిపి కె.ఎస్‌.బాలసుబ్ర మణ్యంను ఆదేశించాలని కెపిసిసి జనరల్‌ సెక్రటరీ సూరానాద్‌ రాజశేఖరన్‌ రాష్ట్ర హోం మంత్రి రమేష్‌ చెన్నితాలను కోరారు. ఈ వ్యాసాన్ని ప్రచురించిన వారపత్రిక ఎడిటర్‌ కాంగ్రెస్‌ ఆరోపణలను తిరస్క రించారు.  ఈ వ్యాసంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన కెపిసిసి అధ్యక్షుడు వి.ఎం.సుధీరన్‌ చరిత్రను వక్రీకరించేందుకు, నెహ్రూ ప్రతిష్టను దెబ్బతీసేందుకు సంఫ్‌ుపరివార్‌ చేసిన మరో ప్రయత్నం ఇది అని అన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన కేసరి పత్రిక ఎడిటర్‌ ఎన్‌.ఆర్‌.మధు రాజకీయ కారణాలతో కాం గ్రెస్‌ నాయకులు వాస్తవాలను తప్పుదారి పట్టిస్తున్నా రని అన్నారు. విభజనతో సహా కీలకమైన అంశాలను ప్రస్తావించడం, నెహ్రూ విధానాలను తాము విమర్శిం చడం ఇదేమీ మొదటిసారి కాదని, అయితే ఇప్పుడు నెహ్రూపై దాడి విషయాన్ని ఈ వ్యాసంలో తెలియ జేశారని మధు మీడియాతో అన్నారు. సిపిఎం కంటే ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలనే తాము ఎక్కువ వ్యతిరేకిస్తు న్నామనే విషయాన్ని తెలియజేసేందుకు కాంగ్రెస్‌ నాయకులు కుయుక్తితో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: