రాజధాని నిర్మాణానికి అవ సరమైన భూసేకరణ పనులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం వేగవంతం చేసింది. రానున్న ఐదు సంవ త్సరాలలో 33 వేల ఎకరాలలో నూతన రాజధానిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం సచివాలయంలో రాజధాని సలహా సంఘంతో ముఖ్య మంత్రి చంద్రబాబు సమీక్షించారు. భూ సమీకరణ ద్వారానే రాజధానిని నిర్మించాలని, రైతులు ఒప్పుకోని పక్షంలో భూ సేకరణ విధానంతో ముందుకు సాగా లని సలహా సంఘానికి సూచించారు. భూ సమీ కరణకై అయ్యే వ్యయం, సమన్వయంపై ఓ ప్రత్యేకా ధికారిని నియమించనున్నట్ల తెలిపారు. భూ సమీక రణకై సహకరించేందుకు రైతులను ఒప్పించే బాధ్య తను స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రులు, కలెక్టర్లు తీసుకోవాలని ఆదేశించారు. భూ సమీకరణ ద్వారా సేకరించిన భూమికి ఎకరాకు సంవత్సరానికి రూ.25 వేల చొప్పున పది సంవత్సరాల పాటు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ వంటి అంశాలలో మిన హాయింపు ఇవ్వనున్నారు. కాగా భూమిలేని నిరుపేదలకు నైపుణ్యంతో కూడిన వృత్తులలో శిక్షణ ఇప్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. విజయ వాడ, గుంటూరు నగరాలను సుందరంగా తీర్చిదిద్దవలసి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: