వర్షాభావం మరోపక్క కరెంటు కోతలు వెరిసి చేతికొచ్చిన పంటలు కళ్లముందే ఎండిపోతు న్నాయి. చేసిన అప్పులు తీర్చేదెట్లా అంటూ అన్న దాతలు పిట్టల్లా రాలిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ కష్టాలు ఇక తొలిగిపోతాయంటూ భావించిన రైతుల ఆశ లు నీరిగారిపోయాయి. ఆపదలో ఉన్న అన్నదాతలకు అప న్న హస్తం అందించాల్సిన ప్రభుత్వం మీనావేశాలు లెక్కిం చడంతో రోజు 10మంది రైతులు తనువులు చాలించు కుంటున్నారు. పచ్చని పైర్ల మధ్య తరుగాడాల్సిన రైతులు చెట్టుకు వేలాడుతున్నారు. మరికొంతమంది పురుగుల మందు తాగి చనువుచాలిస్తున్నారు. ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన రుణమాఫీ కాగితాలకే పరిమితమవడంతో చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. గత నెల రోజులుగా రాష్ట్రంలో 270మంది రైతులు బలవ న్మరణానికి గురయ్యారు. దీపావళి పండుగరోజే తెలంగా ణాలోని తొమ్మిది జిల్లాలలో 14మంది రైతులు ఆత్మహత్య లకు ఒడిగట్టారు. శనివారం నాడు అయిదుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులకింత దయనీయస్థితి ఎందుకువచ్చింది? ఉరికొయ్యలకు బలిచేస్తున్న కారణా లేంటి? అని సమిక్షిస్తే పలు దయనీయ పరిస్థితులు వెలు గులోకి వచ్చాయి. తెలంగాణాలో వర్షాదార పంటలపైనే ఆ ధారపడి జీవిస్తున్న రైతులకు సకాలంలో వర్షాలు కురువక పోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. దీనికి తోడుగా క రెంటు కోత తోడవడంతో చేతికొచ్చిన పంటలు కళ్లముందే ఎండిపోవడాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్న రైతులు ఆ త్మహత్యలే శరణ్యంగా భావించి తనువు చాలించుకుంటు న్నారు. పెరిగిన పెట్టుబడి వర్షాలు లేక ఎండుతున్న పంట లు, గత ఏడాది తీసుకున్న పంటరుణాల మాఫీకాకపోవ డం, ఈ ఏడాడి బ్యాంకులు పంటరుణాలు ఇచ్చేందుకు స సేమీరా అనడంతో ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులతో అప్పుతీసు కొని వ్యవసాయాన్ని కొనసాగించారు. అప్పులు తడిసి మో పడవడం, ప్రభుత్వంనుంచి రైతులకు భరోసా కల్పించక పోవడంతో రైతులు పిట్టల్లారాలిపోతున్నట్లు వ్యవసాయ ని పుణులు పేర్కొంటున్నారు. శనివారంనాడు మహబూబ్‌నగ ర్‌ జిల్లా కొందుర్గు మండలం ఉమ్మేంతాలలో, రంగారెడ్డి జి ల్లా షాబాద్‌ మండలం ముద్దెంగూడ, నల్గొండ జిల్లా నార్కే ట్‌పల్లి మండలం ఔరావాణి, ఖమ్మం జిల్లాలో ఇద్దరు రైతు లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రైతన్నల ఆత్మహత్యల ప రంపర కొనసాగుతూనే ఉంది. రైతన్నలకు అన్ని విధాలా మనోధైర్యం కల్పించిన ప్రభుత్వం వారిని పట్టించుకోకపో వడంతోపాటు ఇందుకు కారణం గత పాలకులే అంటూ వారిపై నెపంమోపడం కోసమే ప్రాకులాడుతున్నదన్న విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: