జవహర్లాల్ నెహ్రూ హత్యకు కుట్ర జరిగిందా? నెహ్రూని చంపాలని అప్పట్లో నాథూరం గాడ్సే డిసైడ్ అయ్యాడా? చివరాఖరికి డెసిషన్ మార్చుకున్న తర్వాతే గాంధీని చంపాడా? అవుననే అంటోంది కేరళకు చెందిన కేసరి మ్యాగ్జైన్. ఇప్పుడు ఈ అంశమే కాంగ్రెస్ పార్టీకి అంది వచ్చిన అస్త్రంగా మారింది. దేశ ముక్కలైపోతోంది. ఆపేశక్తి లేదు. వారించే శక్తి లేదు. చేయాల్సింది ఒక్కటే. దేశ విభజనకు కారణమైన వారిని చంపడం. ఇదీ ఇండియా విభజన టైంలో నాథూరాం గాడ్సే ఆలోచన. దేశ విభజనకు ప్రధాన ముద్దాయిగా మోహన్-దాస్ కరంచంద్ గాంధీయేనని భావించిన నాథూరాం గాడ్సే అతనిని హత్య చేయడానికి నిర్ణయించుకున్నాడు. 1948 జనవరి 30వ తేదీ సాయంత్రం 5 గంటల 17 నిమిషాల సమయంలో అతి దగ్గర నుంచి గాంధీని కాల్చి చంపాడు గాడ్సే. ఇదంతా అందరికీ తెల్సిన చరిత్ర. అయితే గాంధీని చంపడం మొదట గాడ్సేకి ఇష్టం లేదట.  దేశ విభజనకు పూర్తి బాధ్యత నెహ్రూదేనని భావించిన గాడ్సే తొలుత జవహర్-నే చంపాలని భావించాడట. ఈ విషయాన్ని ప్రచురించింది కేరళకు చెందిన కేసరి వార పత్రిక. ఆర్ఎస్ఎస్ కేరళ విభాగం ఆధ్వర్యంలో ప్రచురితం అయ్యే కేసరి మ్యాగ్జైన్-లో ఈ నెల 17వ తేదీన గోపాలకృష్ణన్ అనే అతను ఈ ఆర్టికల్ రాశాడు. ఇంతకీ గోపాలకృష్ణన్ ఎవరో తెలుసా? మొన్నటి లోక్-సభ ఎన్నికల్లో కాలక్కుడై నియోజకవర్గం నుంచి బీజెపీ అభ్యర్థిగా పోటీచేసిన వ్యక్తి. ఈ ఆర్టికల్ ఇప్పుడు కేరళ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. మరోవైపు కేసరి పత్రికలో వచ్చిన వార్తను ఖండిస్తూ ఆర్ఎస్ఎస్ ప్రకటన రిలీజ్ చేస్తే కేసరి పత్రికను మూసెయ్యాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: