గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర్ రావు తనయుడు బోండా సిద్ధార్థ్ చిక్కుల్లో పడ్డాడు. ఒక యువకుడి మరణానికి కారణం అయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడీయువకుడు. గుంటూరు పరిసరాల్లో కార్ల రేసులు పాల్గొనే అలవాటున్న సిద్ధూ ఆదివారం రాత్రి రేసుల్లో పాల్గొన్నాడని.. తన కార్ ను చాలా వేగంతో నడుపుతూ... రేసులోనే ఉన్న మరో కారును ఢీ కొట్టాడని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో సిద్దూ గాయపడ్డాడని.. మరో కారులోని యువకుడు మరణించాడని సమాచారం. మొదట ఇది సాధారణ ప్రమాదమే అనుకొన్నా... తర్వాత అక్కడ కార్ల రేసు జరిగిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. అయితే బోండా సిద్ధూ ఇప్పుడు పరారీలో ఉండటమే ఆసక్తికరంగా మారింది. అతడిని పోలీసులే తప్పించారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే తనయుడు అనే విషయాన్ని తెలుసుకొని పోలీసులు అతడిని తప్పించారని... పారిపోయాడని అంటున్నారని వార్తలు వస్తున్నాయి. బోండా సిద్దూ ఇంట్లోనే ఉన్నాడని.. ఇంట్లోనే అతడికి శస్త్ర చికిత్స జరుగుతోందని సమాచారం. అయితే అధికారులు మాత్రం అతడు పరారీలో ఉన్నాడని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే రెండు సెక్షన్ల కింద బోండా సిద్ధూ మీద కేసులు నమోదు చేశారు. సెక్షన్ 304, 370 కింద కేసులు నమోదయ్యాయి. కొంతమంది రాజకీ నేతలు రంగంలోకి దిగారని.. సిద్ధూ ను కేసు లోంచి తప్పించే ప్రయత్నం జరుగుతోందని సమాచారం. మరి ఈ వ్యవహారం ఎంత వరకూ వెళుతుందో.. ఎమ్మెల్యే తనయుడి పరిస్థితి ఏమిటో!

మరింత సమాచారం తెలుసుకోండి: