మరి నరేంద్రమోడీ ఇచ్చిన ఆత్మవిశ్వాసమో ఏమో కానీ... భారతీయజనతా పార్టీ పుంజుకొనే ప్రయత్నాలను తీవ్రం చేస్తోంది. తమ ఉనికి అంతగాలేని చోట కూడా భారీ లక్ష్యాన్ని పెట్టుకొంది కమలం పార్టీ. భారతీయ జనతా పార్టీ ఉనికి అంతగా లేని రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. అయితే మొన్నటి ఎన్నికల్లో బీజేపీ కొంతలో కొంత బెటర్ అనిపించింది. ఈ నేపథ్యంలో ఏపీలో బలపడే ప్రయత్నాలను తీవ్రం చేసింది బీజేపీ. నవంబర్ ఒకటో తేదీ నుంచి ఏపీలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నదట భారతీయ జనతా పార్టీ. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు 20 లక్షల మందికి సభ్యత్వం ఇవ్వాలనేది బీజేపీ లక్ష్యమట. గత ఏడాది బీజేపీ కేవలం ఆరు లక్షల మందికి సభ్యత్వం ఇవ్వగలిగింది. అయితే ఈ సారి ఆ సంఖ్యను 20 లక్షలకు చేర్చాలని బీజేపీవాళ్లు లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు ఒక ప్రకటన కూడా చేశారు. గత ఏడాది సభ్యత్వం ఇచ్చిన ఆరు లక్షల మందితో పాటు మరో 14 లక్షల మందికి సభ్యత్వం ఇచ్చి మొత్తంగా 20 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకోవాలని బీజేపీ నేతలు లెక్కలు చెబుతున్నారు. మరి కమలనాథులు ఆ సంఖ్యను చేరుకోగలరో లేదో చూడాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: