తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆరు అంకె పై ఎంతో నమ్మకం. ఆయన వాడే వాహనాల నెంబర్లు కూడా ఆరు అంకెలతోనే ఉంటాయి. అయితే తాజాగా క్యాబినెట్ సమావేశం కూడా ఆయన ఇరవైనాలుగో తేదీన ఆరు గంటలకు పెట్టడం కూడా ఈ నమ్మకంతోనే అంటూ మీడియాలో కధనం వచ్చింది.ఇరవై నాలుగో తేదీ అంటే ఈ రెండు అంకెలను కలిపితే ఆరు అవుతంది. అలాగే ఆరు గంటలకు సమయంగా పెట్టుకున్నారు.కాని కారణాంతరాల వల్ల కెసిఆర్ 6.45 గంటలకు క్యాబినెట్ కు హాజరయ్యారు.మూడు నెలల తర్వాత క్యాబినెట్ సమావేశం పెట్టడంతో ఈ తేదీని ఎంపిక చేసుకుని ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. ఏది ఏమైనా నేతల నమ్మకాలు ఆసక్తికరంగా ఉంటాయి.ఇది మంచిదేనా అంటే ఎవరి నమ్మకం వారిది.ప్రజలకు, ఇతరులకు ఇబ్బంది లేనంతవరకు ఓకే.

మరింత సమాచారం తెలుసుకోండి: